Hyderabad: చెడ్డీ గ్యాంగ్.. అంతకమించి.. వీడు వేరే లెవెల్ దొంగోడు రాజా..
పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. బైక్ పోయిందని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
పాపం.! పోలీసులకే రక్షణ లేకుండాపోతోంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ఇంటి ముందు బైక్ పెట్టుకోగా.. అది కాస్తా చోరీకి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. కోఠి ఇసామియా బజార్‌లో నివాసముంటున్న సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి సిటీ ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇక అతడు ఇంటి ముందు పార్క్ చేసిన తన బైక్ దొంగతనానికి గురైందని సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం అర్ధరాత్రి ఇసామియా బజార్‌లోని తన ఇంటి ముందు పార్క్ చేసిన యూనికార్న్ బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడని కంప్లయింట్‌లో పేర్కొన్నాడు. ఇక కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

