అబిడ్స్, ఫిబ్రవరి 7: అబిడ్స్ బ్రోతల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన అర్జున్, రవితో పాటు మరో బ్రోకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. త్వరలో నిందితులను పోలీసుల కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు అమ్మాయిలను తరలించి ఈ ముఠా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హోటల్ యజమాని అఖిల్ పహిల్వాన్‌కు బ్రోకర్‌లతో పరిచయం ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు.
అబిడ్స్‌లో ఫార్చూన్ హోటల్ అడ్డాగా నిర్వహిస్తోన్న బోత్రల్ దందా గుట్టురట్టయిన విషయం తెలిసిందే. రాంగనగర్ చెందిక పహిల్వాన్ అఖిలేష్ అండ్ బ్యాచ్ ఉద్యోగాల పేరిట యువతుల్నివ్యభిచార రొంపిలోకి దింపుతున్న వైనం పోలీసుల మెరపు దాడులతో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఫార్చూన్ హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు.. 16 మంది యువతుల్ని రెస్క్యూ చేశారు. నిర్వాహకులు అఖిలేష్ అండ్ బ్యాచ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో నిర్బంధించి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. అంతేకాదు విదేశీ యువతుల్ని కూడా ట్రాప్ చేసి.. ప్రముఖులకు, సెలబ్రిటీలకు అమ్మాయిలను సప్లై చేస్తున్నారనే అనుమానాల క్రమంలో వైడ్ యాంగిల్‌లో ఎంక్వయిరీ చేపట్టారు పోలీసులు.
నిప్పులేనేదే పొగరాదన్నట్టు విచారణలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఫార్చ్యూన్ హోటల్ లో 25 రూములలో 16 రూములను వ్యభిచారం కోసం వాడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. అంతేకాదు కూపీలాగితే ఇంటర్నేషనల్ లెవల్‌లో డొంక కదిలింది. అఖిలేష్ మొబైల్ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. ఫార్చూన్ హోటల్ బ్రోతల్ కేసులో కింగ్ పిన్ సలువడి అఖిలేష్‌తో పాటు పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్‌లు ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.