Home Work: నిన్న తమిళనాడు.. నేడు తెలంగాణ! హోంవర్క్‌ ఒత్తిడి తట్టుకోలేక 8వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య..

|

Aug 26, 2022 | 11:20 AM

అడుతూ పాడుతూ పాఠశాల విద్యను పూర్తి చేయవల్సిన విద్యార్ధులకు సైతం ఒత్తిడి (stress) బూచి బయపెడుతోంది. స్కూళ్లో పరిమితికి మించి ఇస్తున్న హోంవర్క్‌ వారి పాలిట గుది బండలా మారుతుంది. తమ గోడు వినేవారు లేక..

Home Work: నిన్న తమిళనాడు.. నేడు తెలంగాణ! హోంవర్క్‌ ఒత్తిడి తట్టుకోలేక 8వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య..
Student Suicide
Follow us on

Hyderabad School Student dies by suicide: అడుతూ పాడుతూ పాఠశాల విద్యను పూర్తి చేయవల్సిన విద్యార్ధులకు సైతం ఒత్తిడి (stress) బూచి బయపెడుతోంది. స్కూళ్లో పరిమితికి మించి ఇస్తున్న హోంవర్క్‌ వారి పాలిట గుది బండలా మారుతుంది. తమ గోడు వినేవారు లేక విద్యా కుసుమాలు అర్థాంతరంగా రాలిపోతున్నాయి. గత సోమవారం తమిళనాడుకు చెందిన 9వ తరగతి విద్యార్ధి హోం వర్క్‌ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి మరువక ముందే రాష్ట్రంలో మరో విద్యార్ధి బలయ్యాడు. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌ నగరంలోని హయత్ నగర్‌కు చెందిన అర్‌టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్‌లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. నిన్న (ఆగస్టు 25) యథావిథిగా స్కూల్‌కి వెళ్లిన అక్షయ హోం వర్క్‌ చేయలేదనే కారణం చేత టీచర్‌ మోకాళ్ళ పై నిల్చోబెట్టింది. తోటి విద్యార్ధుల ముందు మోకాళ్లపై నిల్చున్న అక్షయ అవమానంగా భావించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్షయ సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి చేరుకుంది. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తలుపు తడితే ఎంతకూ తెరవకపోవడంతో, తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా.. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విగత జీవిగా ఫ్యాన్‌కు వెలాడటం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అక్షయ చదువుతున్న స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు బైఠాయించి బందువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు చేపట్టారు.