CM KCR: ప్రతి విషయంలోనూ దేశ గౌరవం దెబ్బతింటోంది.. మోడీపై కేసీఆర్‌ ఫైర్‌..

|

Jul 02, 2022 | 1:52 PM

CM KCR: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం కేసీఆర్‌ ఘన స్వాగతం..

CM KCR: ప్రతి విషయంలోనూ దేశ గౌరవం దెబ్బతింటోంది.. మోడీపై కేసీఆర్‌ ఫైర్‌..
Follow us on

CM KCR: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి జలవిహార్‌ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. యస్వంత్ సిన్హా లాయర్ వృత్తితో తన జీవితం ప్రారంభించారని, విదేశాంగ శాఖామంత్రిగా విదేశాల్లో సైతం మంచి గుర్తింపు సాధించారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలిన చేసుకోని ఓటు వేయాలని కోరుతున్నానని అన్నారు. ఇద్దరు ప్రెసిడెంట్ అభ్యర్థుల పనితీరు, తేడా ఒకసారి ఓటర్లు గమనించాలి. దేశంలో జరుగుతున్న విషయాలపై ప్రతీ ఒక్కరూ గొంతు ఎత్తాలి. దేశంలో కొత్త పరివర్తన రావాలి. ఇవ్వాళ మోడీ హైదరాబాద్ వస్తున్నారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. ప్రధాని ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు.

ఒక్క హామినైనా మోడీ నెరవేర్చితే ఇవ్వాళ చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. టార్చ్ లైట్ పెట్టి వెతికినా మోడీ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క వర్గానికి మోడీ ప్రభుత్వం న్యాయం చేయలేదని, రైతులు 13 నెలలు ఆందోళన చేశారు.. ఆందోళన చేసిన రైతులను భూతులు తిట్టారు.. 700 మంది రైతులు మృత్యువాత పడ్డారు. మరణించిన రైతులకు టీఆరెస్ ప్రభుత్వం 3 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు.

మోడీ కంటే ముందు కూడా ఎందరో ప్రధానులయ్యారు. మేమే శాశ్వతమనే భ్రమలో మోడీ ఉన్నారని కేసీఆర్‌ విమర్శల వర్షం కురిపించారు. మీరు గొంతు పెంచుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. ఇక నుంచి దేశంలో ఇది జరగదన్నారు. మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారని, ప్రతి విషయంలోనూ దేశ గౌరవం దెబ్బతింటోందని అన్నారు. రాజకీయ మార్పు అనేది తప్పనిసరి వస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

దేశం అభివృద్ధి కాదు.. సర్వనాశనం జరుగుతోందని దుయ్యబట్టారు. జరుగుతున్నది ఏంటి? ప్రచారం చేస్తున్నదేంటని ప్రశ్నించారు. బ్యాంకుల్లో NPA భారీగా పెరిగాయి. మీరు మౌనంగా ఉంటారేమో మేం ఉండలేం, పోరాటం చేస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. గతంలో రూపాయి విలువ తగ్గినప్పుడు మీరు గొంతు చించుకున్నారు.. మీ హయాంలో ఇప్పుడు రూపాయి విలువ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. జనాల్లో ఆగ్రహం పెరుగుతోంది.. తప్పుడు నిర్ణయాలు, విధానాల కారణంగా దేశం దిగజారుతోందని ఆక్రోశం వెల్లగక్కారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి