Telangana Cabinet: కొనసాగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. ఈ కీలక అంశాలపై చర్చ..!

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ..

Telangana Cabinet: కొనసాగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. ఈ కీలక అంశాలపై చర్చ..!
Cm Kcr

Updated on: Sep 03, 2022 | 3:03 PM

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ కొనసాగుతోంది. ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులతో పాటు పలువురు అధికారులు కూడా హాజరయ్యారు. ఈనెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో సీబీఐ రాకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో విలీన వజ్రోత్సవాల ఏర్పాట్లపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌ దిశా నిర్ధేశం చేశారు.

రాష్ట్రంలో మరో ఐదు యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబోతోంది మంత్రివర్గం. అలాగే రాష్ట్రంలో విద్యుత్ బ‌కాయిలు, పోడు భూములు, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై చర్చించే అవకాశం ఉంది. ఇక కేబినెట్‌ ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్‌ హాజరు కానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి