AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Wave: చలి పంజా.. వచ్చే 3 రోజులు దుమ్మురేపుతదట.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు అలర్ట్..

ఓ వైపు తీవ్రమైన చలి.. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. అయితే.. తీవ్రమైన చలితో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.

Cold Wave: చలి పంజా.. వచ్చే 3 రోజులు దుమ్మురేపుతదట.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు అలర్ట్..
Cold Wave
Shaik Madar Saheb
|

Updated on: Nov 18, 2025 | 9:24 AM

Share

ఓ వైపు తీవ్రమైన చలి.. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. అయితే.. తీవ్రమైన చలితో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే.. తెలంగాణ సహా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కూడా దాటడం లేదు.. ముఖ్యంగా తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD).. భారతదేశం అంతటా చలిగాలులు, వర్షపాతం హెచ్చరికలను జారీ చేసింది. అంచనాల ప్రకారం, నవంబర్ 18-20 మధ్య పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మరాఠావాడ, తెలంగాణ, విదర్భలోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని IMD బులెటిన్ తెలిపింది.

తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో చలిగాలుల హెచ్చరిక

సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్‌లలో చలిగాలుల కారణంగా యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాలతో సహా తెలంగాణలోని మరో ఐదు జిల్లాల్లో నవంబర్ 18న తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది.

సంగారెడ్డి, కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. భూపాలపల్లి జిల్లాలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండ, వరంగల్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, మెదక్‌, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్‌లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏపీలో కూడా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అల్లూరి జిల్లా మినుములూరులో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 7.3, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పాడేరులో ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !