Telangana: రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైతుబంధు సహాయం జమ.. టోల్ ఫ్రీ సైతం ఏర్పాటు

|

Jun 22, 2022 | 4:53 PM

రాష్ట్రంలోని రైతులందరికీ త్వరలోనే రైతుబంధు పెట్టుబడి సాయం అందిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) చెప్పారు. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయశాఖలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ...

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైతుబంధు సహాయం జమ.. టోల్ ఫ్రీ సైతం ఏర్పాటు
Niranjan Reddy
Follow us on

రాష్ట్రంలోని రైతులందరికీ త్వరలోనే రైతుబంధు పెట్టుబడి సాయం అందిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) చెప్పారు. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయశాఖలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. సకాలంలో డబ్బులు జమ చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. హైదరాబాద్(Hyderabad) నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయశాఖ కాల్‌ సెంటర్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రైతుబంధు పై వివరాలు తెలుసుకునేందుకు, ఫిర్యాదు చేసేందుకు త్వరలోనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విజ్ఞప్తులు తీసుకునేందుకు ఈ కాల్‌ సెంటర్‌ను ఉపయోగపడుతుందని చెప్పారు. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో పడిన కష్టాలు, జరిగిన నష్టాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని మంత్రి ఉద్ఘాటించారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం చేతులెత్తేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధాన్యం కొంటున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యవసాయ రంగంపై ఒక విధానమంటూ లేదని తీవ్రంగా విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి