తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 31, మంగళవారం రాత్రి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో.. ఉచిత రవాణా సదుపాయం అందిస్తామని వెల్లడించింది. ఇందుకోసం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని.. తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రజలంతా ఈ సర్వీసు వినియోగించుకోవాలని.. మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేసి.. ప్రమాదాలకు కారకులు, బాధితులు అవ్వొద్దని.. తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కోరింది. గత 8 సంవత్సరాలుగా ఈ సర్వీసు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసు కోసం కాల్ చేయాల్సిందిగా వారు 9177624678 నంబర్‌ను అందుబాటులో ఉంచారు. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (TGFWDA), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) #HumAapkeSaathHai క్యాంపెయిన్‌తో ఈ సర్వీసు అందిస్తున్నట్లు తెలిపాయి.
సంబంధిత వీడియో దిగువన చూడండి…
పార్టీకి రెడీ అయిన భాగ్యనగరం
భాగ్యనగరం భారీ ఈవెంట్‌కు రెడీ అయింది. ప్రతి ఏడాది లాగే.. ఈసారి కూడా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు హైరదాబాద్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024కి గుడ్ బై చెప్పి.. 2025కి స్వాగతం పలికేందుకు.. మరికొన్ని గంటలే మిగిలి ఉంది. న్యూఇయర్ స్పెషల్ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్ మేనేజర్స్ భారీ ఏర్పాట్లు చేస్తుండగా.. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ అదే రేంజ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
న్యూ ఇయర్ అంటే.. డీజే పాటలు, కేక్ కటింగులు, మందు, చిందులు కామన్. థర్టీ ఫస్ట్ రోజు.. దూంధాంగా ఎంజాయ్ చేసి.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం అనేది రెగ్యులర్‌గా జరిగేదే. న్యూ ఇయర్ ఈవెంట్స్‌కు చిన్న పెద్ద అనే తేడా ఉండదు. ఎవరి ఏజ్‌కు తగ్గట్లు వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు. యువత పబ్బులు, క్లబ్బులు, రిసార్టుల్లో డీజే స్టెప్పులకు చిందులేస్తే.. ఆపై ఏజ్ వారు.. ఇంటి దగ్గరే బంధు మిత్రులతో సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇక టీనేజర్స్ సంగతి చెప్పనక్కర్లేదు. థర్టీ ఫస్ట్ రోజు సాయంత్రం నుంచే రోడ్లపై హల్‌చల్ చేయడం, అర్థరాత్రి రోడ్లపై రైడ్స్ చేస్తూ.. కేకులు కట్ చేస్తూ న్యూఇయర్‌కు స్వాగతం పలకడం చేస్తుంటారు. న్యూఇయర్ వేడుకలు జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్‌నే బెస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటారు. కోటి మందికి పైగా ఉండే.. హైదరాబాద్ ప్రజలు కూడా ఈసారి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రిపేర్ అవుతున్నారు.
న్యూఇయర్ వేడుకల్లో హైదరాబాదీల చాయిస్ మారుతోంది. ఇంట్లోనే ఉండి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలనే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. కుటుంబం అంతా ఓ చోట చేరి సినిమా లేదా న్యూ ఇయర్ ఈవెంట్లను టీవీల్లో చూస్తూ ఎంజాయ్ చేయడానికి కొందరు ఇష్టపడుతున్నారు..
మరికొందరు పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, ఆలయాల్లో పూజలు చేయడం, చర్చిల్లో ప్రార్థనలు చేయడం ఇష్టపడుతున్నారు. ఇంకొందరు.. ట్రాఫిక్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు దూరంగా ఇంట్లోనే ఉంటూ.. కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య సెలబ్రేట్ చేసుకోవాలని ప్రిఫర్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు.. టపాసులు కాల్చడం లాంటి.. బయటకు వెళ్లి నేచర్‌ను డిస్టర్బ్ చేయడం ఇష్టపడటం లేదు. మొత్తానికి థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్‌కు యువత, టీనేజర్స్ ఎవరి ప్రిపరేషన్స్‌లో వారుంటే.. ఫ్యామిలీస్ మాత్రం పార్టీలకు దూరం దూరం అంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇ క్కడ క్లిక్ చేయండి