Telangana: టెట్‌ పరీక్షలో గందరగోళం.. నిలిచిపోయిన పరీక్ష! అసలేం జరిగిందంటే

|

Jan 12, 2025 | 2:02 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 2న ప్రారంభమైన ఈ పరీక్షలు 20వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే మొత్తం 2.75 ల‌క్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవనున్నారు. అయితే తాజాగా ఓ పరీక్ష కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది..

Telangana: టెట్‌ పరీక్షలో గందరగోళం.. నిలిచిపోయిన పరీక్ష! అసలేం జరిగిందంటే
TET Exam
Follow us on

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 2వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగియనున్నాయి. అయితే శనివారం జరిగిన టెట్ పరీక్షల్లో ఓ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. శంషాబాద్‌లోని వర్ధమాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన టెట్‌ పరీక్షా కేంద్రంలో రెండో సెషన్‌ పరీక్ష మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైంది. మొత్తం 750 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. వారిలో 467 మంది హాజరయ్యారు. శనివారం రెండో సెషన్‌లో పేపర్‌-2 గణితం, సైన్స్‌(తెలుగు మీడియం) పరీక్ష నిర్వహించారు. షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష సాయంత్రం 4.30 గంటల వరకు జరగాల్సి ఉంది. అయితే పరీక్ష ప్రారంభమైన కాసేపటికి ఉన్నట్లు సర్వర్‌ డౌన్‌ అయింది. దీంతో దాదాపు 150 మంది అభ్యర్థులకు టెట్‌ పరీక్ష నిలిచిపోయింది.

పది నిమిషాల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పుకుంటూ నిర్వాహకులు కాలం వెలిబుచ్చారు. అయితే పరీక్ష సమయం మించి పోతున్నా ఈ 150 మంది సర్వర్‌ కారణంగా పరీక్ష రాయలేకపోయారు. ఫలితంగా రాత్రి వరకు అభ్యర్ధులు రాత్రి వరకు పరీక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రాత్రి 6.30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోనే అభ్యర్ధులు పడిగాపులు కాశారు. మరోవైపు పరీక్ష రాసేందుకు లోపలికి వెళ్లిన తమవారు బయటికి రాకపోవడంతో పరీక్షా కేంద్రం బయట ఉన్న అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అభ్యర్థులకు మద్దతుగా శంషాబాద్‌- షాబాద్‌ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.

పది నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తామని నిర్వాహకులు చెప్పినా.. రాత్రి వరకు పరిష్కారం కాకపోవడంతో అభ్యర్థులు సైతం సెంటర్‌లోనే ధర్నాకు దిగారు. ఎట్టకేలకు రాత్రి 6:30కు పరీక్ష తిరిగి ప్రారంభమైంది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. చివరకు ఆ 150 మంది పరీక్ష రాసి బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం క్లిక్‌ చేయండి.