హైదరాబాద్‌‌లోని బార్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు..

|

Nov 11, 2024 | 9:37 PM

హైదరాబాద్‌‌లో పలు బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై టాస్క్‌‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల సందర్భంగా సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షలకు పంపారు. 

హైదరాబాద్‌‌లోని బార్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు..
Task Force Police Raids On Bars And Restaurants In Hyderabad
Follow us on

హైదరాబాద్‌ నగరంలోని పలు బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఇవాళ టాస్క్‌‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు జరిపింది. విద్యానగర్‌లోని కింగ్స్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌తోపాటు చిక్కడపల్లిలోని మధిరాలయ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని వింటేజ్‌ బార్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అత్యధికంగా రూల్స్‌కు విరుద్దంగా నిర్వహిస్తున్న బార్‌గా కింగ్స్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను అధికారులు గుర్తించారు. బార్‌లోపల అపరిశుభ్రంగా ఉందని, కిచెన్‌లో ఏర్పాటు చేసిన చిమ్నీ, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు జిడ్డుతో కనిపించాయి. వాటిని కొన్ని సంవత్సరాలుగా క్లీన్‌ చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు.

అలాగే వాషింగ్‌ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండటం, రిఫ్రిజిరేటర్లలో వెజ్‌, నాన్‌ వెజ్‌ పదార్థాలను కలిపి ఉండటం అధికారులు రికార్డు చేశారు. ఇక హెల్త్‌, పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా మెయింటెయిన్‌ చేయటం లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే చికెన్‌ వేస్టేజ్‌‌ని హైదరాబాద్‌లోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సప్లయ్‌ చేస్తున్నట్టు ఇటీవలి దాడుల్లో బయటపడింది. కింగ్స్‌ బార్‌తో పాటు పలు బార్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండటంతో అధికారులు ఆయా బార్లకు నోటీసులు జారీ చేశారు. దాడుల సందర్భంగా సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షలకు పంపారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి