ఉదయం నుంచి భానుడి భగభగలకు ఉక్కిరి బిక్కిరి అయిన నగర వాసులను ఆకస్మికంగా వరుణుడు కరుణించాడు. నగరంలోని పలుచోట్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ గాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కూకట్ పల్లి, మాసబ్ ట్యాంక్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, తిరుమలగిరి, జవహార్ నగర్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.