Hyderabad: హిజాబ్ ధరించి పరీక్ష రాయడానికి వచ్చారని సిబ్బంది ముస్లిం విద్యార్థినులను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కాలేజీలో ఉర్దూ మీడియం పరీక్ష రాసేందుకు రాసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారు. దీంతో సెంటర్ దగ్గర ఉన్న కాలేజీ సిబ్బంది వారిని అడ్డుకుని హిజాబ్ తొలగించాలని కోరారు. దాదాపు అరగంట పాటు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరికి గత్యంతరం లేక విద్యార్థినులు హిజాబ్ తీసి పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది.
అంతే కాకుండా రేపటి నుంచి హిజాబ్ తొలగించి రావాలని కాలేజీ యాజమాన్యం హెచ్చరించిందని విద్యార్థులు అంటున్నారు. ఈ క్రమంలో హిజాబ్ ధరించడం పరీక్ష నిబంధనలకు విరుద్ధమని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు హోంమంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. హిజాబ్ నెపంతో విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడం సరికాదని తల్లిదండ్రులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..