హైదరాబాద్ నగరంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఉన్న ఎక్సెల్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి.. విద్య ప్రియాంక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విద్య ప్రియాంక ఎక్సెల్ కాలేజీలో NEET కొచింగ్ కోసం చేరింది. హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బిల్డింగ్ 4వ ఫ్లోర్ నుంచి దూచి ఆత్మహత్యకి పాల్పడింది. దీనితో తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు విద్యార్థికి ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
అయితే, విద్యా ప్రియాంక సూసైడ్ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. దీనిని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విద్యార్థినికి ఎక్సెల్ కళాశాలకి ఎలాంటి సంబంధం లేదని కళాశాల యాజమాన్యం పేర్కొంది. చౌటుప్పల్ సమీపంలో ఉన్న దవవో మెడికల్ అకాడెమీలో కోచింగ్ తీసుకుంటుందని.. తాము ఇక్కడ ఆకమిడేషన్ ఇచ్చి రూం ఇచ్చినట్లు పేర్కొంది. మృతురాలితో పాటు మరో 5 మంది విద్యార్థులు కూడా ఇక్కడ ఇలాగే ఉంటున్నట్లు వివరణ ఇచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..