హైదరాబాద్ ఓ గల్లీ లీడర్ రెచ్చిపోయాడు. నమస్తే పెట్టలేదన్న కోపంతో ఓ వ్యక్తిపై దాడి చేశాడు. అంతటితో ఊరుకోక అతడి బైక్‌ను తగలబెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి తన అనుచరులతో కలిసి సెంటర్‌లో నిల్చున్న అరుణ్ అనే గల్లీ లీడర్.. అటుగా వెళ్తోన్న మనోజ్ అనే వ్యక్తిని ఆపాడు. కనిపిస్తే ఎందుకు నమస్తే పెట్టలేదంటూ వాగ్వాదానికి దిగాడు. అంత పొగరెందుకంటూ బూతులు తిట్టి.. అతడిపై దాడి చేయించి.. బైక్‌ను తగలబెట్టాడు. అయితే ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగినా.. వారు మాత్రం తమకేమి పట్టనట్లు ఉండిపోయారు. దీంతో బాధితుడు అరుణ్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.