Asaduddin Owaisi: ఒవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్‌ కోచ్‌పై రాళ్ల దాడి.. సూరత్‌ వెళ్తుండగా ఘటన

|

Nov 08, 2022 | 7:21 AM

ఒవైసీ సూరత్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వందే భారత్‌ రైలులో ప్రయాణించారు. అయితే తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను ఆయన అంతకు ముందు ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. 

Asaduddin Owaisi: ఒవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్‌ కోచ్‌పై రాళ్ల దాడి.. సూరత్‌ వెళ్తుండగా ఘటన
Asaduddin Owaisi
Follow us on

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగిపై రాళ్ల దాడి జరిగింది. గుజరాత్‌లో ఎన్నికల నేపథ్యంలో ఆయన అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన కంపార్ట్‌మెంట్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఒవైసీపై దాడిని ఆపార్టీ నేత వారిస్‌ పఠాన్‌ సోషల్‌ మీడియా వేదికగా ధ్రువీకరించారు. ఈ రాళ్లదాడి ఘటన సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో జరిగిందని తెలిపారు. తాము వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో వెళ్తుండగా సూరత్‌లో ఇది చోటు చేసుకుందని చెప్పారు. ఈ ఘటనలో రైలు అద్దాలు పగిలిపోయాయని కూడా వెల్లడించారు. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా త్వరలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సూరత్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఒవైసీ వందే భారత్‌ రైలులో ప్రయాణించారు. అయితే తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను ఆయన అంతకు ముందు ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

కాగా అసదుద్దీన్‌పై దాడి జరగడం ఈ ఏడాదిలో రెండోసారి. ఫిబ్రవరిలో హాపూర్ జిల్లాలో ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న ఒవైసీ మీరట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన సమయంలో ఛిజార్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటన నుంచి ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఈ కేసులో ఇద్దరు నిందితులు సచిన్, శుభమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..