హైదరాబాద్: మూవీ ఇండష్ట్రీలో స్పెషల్ ఎఫెక్ట్స్‌కి ఇప్పుడు చాలా కొత్త, కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ కంప్యూటర్ వాడకం లేని రోజుల్లోనే వెండితెర వండర్స్ క్రియేట్ చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్, ప్రముఖ టెక్నీషియన్ ఏక్‌నాథ్ (70) కన్నుమూశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఏక్‌నాథ్ 55 ఏళ్ల క్రితమే సినీ పరిశ్రమలో పనిచేసేందుకు మద్రాసు వెళ్లిపోయారు. అమితాబ్, ఎన్టీఆర్, రజనీ, కమల్ హాసన్ సహా దేశంలో టాప్ హీరోల చిత్రాలకు ఆయన పనిచేశారు. ముఖ్యంగా అప్పట్లో ఘన విజయాలు నమోదు చేసిన పలు పౌరాణిక, జానపద సినిమాలకు ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. మొత్తం తన కెరీర్‌లో 700 చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ సమకూర్చారు.