విజయవంతంగా సూపర్‌ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్.. గ్రేటర్ హైదరాబాద్‌లో తొలిరోజు 21,666 మందికి టీకా..

|

May 28, 2021 | 8:12 PM

Vaccination Drive: జీహెచ్ఎంసీ పరిధిలో సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతం అయ్యింది.  రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం...

విజయవంతంగా సూపర్‌ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్.. గ్రేటర్ హైదరాబాద్‌లో తొలిరోజు 21,666 మందికి టీకా..
Vaccination
Follow us on

జీహెచ్ఎంసీ పరిధిలో సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతం అయ్యింది.  రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్ చేశారు. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన నిత్య సేవకులకు నేటి నుండి పది రోజుల పాటు వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ముప్పై సర్కిళ్లలో విస్తృత ఏర్పాట్లను చేపట్టింది.

డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే వారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవారినంతా సూపర్‌ స్ప్రెడర్లు భావించి వీరికి టీకా వేయాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ముందుగానే గుర్తించిన వారికి ప్రత్యేక టోకెన్లను గురువారం నాడే అందచేసి వారికి ఇచ్చే వాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలతో సజావుగా సాగింది.

కాగా నగరంలో చేపట్టిన ఈ ప్రత్యేక వాక్సినేషన్ ప్రక్రియను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి,డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, సీహెచ్. మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ పార్ల మెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తమ పరిధిలోని వాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు.

ఇవి  కూడా చదవండి: అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

విరించి ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి కేటీఆర్.. నిబంధలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

MEIL: తెలంగాణకు మేఘా చేయూత… బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న థాయిలాండ్‌ ఆక్సిజన్ ట్యాంకర్లు