Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి.. పరిరక్షణకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక కమిషనర్: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మహానగరంలోని చెరువులను మరింతగా అభివృద్ధి పరిచేందుకు.. వాటిని పరిరక్షించడానికి ప్రత్యేకంగా ఒక స్పెషల్

Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి.. పరిరక్షణకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక కమిషనర్:  మంత్రి కేటీఆర్

Updated on: Sep 13, 2021 | 10:19 PM

Hyderabad Ponds: హైదరాబాద్ మహానగరంలోని చెరువులను మరింతగా అభివృద్ధి పరిచేందుకు.. వాటిని పరిరక్షించడానికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ కమిషనర్ ని జీహెచ్ఎంసీలో నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ్టి జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశంలో మంత్రి కే. తారకరామారావు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.

గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలోని చెరువుల సుందరీకరణ, అభివృద్ధి, వాటి పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతూ వస్తున్నదని తెలిపిన మంత్రి కేటీఆర్..  ప్రత్యేకంగా ఒక కమిషనర్‌ని నియమించడం ద్వారా ఈ కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

హైదరాబాద్ నగర పరిధిలో 185 చెరువులు మరియు ఇతర జల వనరులు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత స్పెషల్ కమిషనర్ కి అప్పగిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.\

Read also: Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు