Indian Railway: ఇండిగో సంక్షోభం వేళ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్… అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే..

ఇండిగో సంక్షోభంలో కూరుకుపోయింది. విమాన సర్వీసులు నడపలేక దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నేటి నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

Indian Railway: ఇండిగో సంక్షోభం వేళ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్... అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే..
How Trains Turn Without A Steering Wheel

Updated on: Dec 06, 2025 | 1:09 PM

Indigo Flights: ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా వెయ్యికిపైగా ఫ్లైట్లను ఇండిగో రద్దు చేసింది. దీంతో ముందే టికెట్ బుకింగ్ చేసుకున్నవారు, అత్యవసరంగా గమ్యస్థానాలకు చేరాలనుకునేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రయాణికులను ప్రభావితం చేస్తోంది. వరుసగా నాలుగు రోజులుగా ఇండిగో విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో చిక్కుకుపోయిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇండిగో విమానాలు రద్దు అయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్–చెన్నై, చర్లపల్లి–కోల్‌కతా, హైదరాబాద్–ముంబై వంటి మార్గాల్లో అదనపు రైలు సర్వీసులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది.  ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో వారు తమ గమ్యస్థానాలను వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చారు. ఈ స్పెషల్ ట్రైన్లలో ప్రత్యేక బెర్త్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇక రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 37 ట్రైన్లలో 116 అదనపు కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల రద్దీని తీర్చడానికి ఈ అదనపు బోగీలు ఉపయోగపడనున్నాయి.

అటు ఇండిగో సంక్షోభంపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. పరిస్థితిని కేంద్రం నిశితంగా పర్యవేక్షిస్తోందని, ప్రయాణికులు చిక్కుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లలు, వృద్దులు, వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇఫ్పటికే ఇండిగో సంక్షోభంపై ప్రత్యేక దర్యాప్తునకు కేంద్రం ఆమోదించింది. దీని ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.