
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారి కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల సర్వీసులను ప్రకటిస్తోంది. దాదాపు 500కిపైగా స్పెషల్ ట్రైన్స్‌ను నడపనుండగా.. వాటి వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ వస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగే కొన్ని స్పెషల్ రైళ్ల వివరాలను ప్రకటించగా.. తాజాగా మరికొన్ని రైళ్ల వివరాలను వెల్లడించింది. ఏకంగా 9 ప్రత్యేక సర్వీసుల డీటైల్స్ ప్రకటించింది. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
-విశాఖపట్నం-చర్లపల్లి(08511) ప్రత్యేక రైలు సాయంత్రం 17.30 గంటలకు బయల్దేరనుండగా.. తర్వాతి రోజు 8.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 10,12,17,19వ తేదీల్లో అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ తన ప్రకటనతో స్పష్టం చేసింది
-ఇక చర్లపల్లి-విశాఖపట్నం(08512) ప్రత్యే రైలు సాయంత్రం 15.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 11,13,18,20వ తేదీల్లో నడవనుంది
-అలాగే అనకాలపల్లి-వికారాబాద్(07416) స్పెషల్ రైలు సాయంత్రం 21.45 గంటలకు బయల్దేరి గమ్యస్థానానికి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు జనవరి 18వ తేదీన అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది.
-ఇటీవల మరో 11 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకినాడ, వికారాబాద్, పార్వతీపురంచ సికింద్రాబాద్ మధ్య జనవరి 7వ తేదీ నుంచి 12 వరక ఈ రైల్లు నడుస్తాయి. ఈ రైళ్లల్లో జనరల్ క్లాసులతో పాటు స్లీపర్, ఏసీ క్లాసులు ఉంటాయి.