Petrol Stolen: అసలే పెట్రో ధరలు భగభగ మండుతున్నాయి. అలాగని డిమాండ్ తగ్గుతుందా? అంటే అది ఎప్పటికీ జరగని పనే అని చెప్పాలి. మరేం చేయాలి? ఎక్కడ తక్కువగా దొరుకుందా? అని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అవసరాన్ని అదునుగా చేసుకుని కొందరు వ్యక్తులు ఏకంగా పెట్రోల్ ట్యాంకులకే ఎసరు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా పరిధిలో వెలుగు చూసింది. శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్న ఓ ముఠాను ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
వీరిని పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా.. విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. దాదాపు రెండు నెలల నుంచి పలు ట్యాంకుల ద్వారా పెట్రోల్‌ను దొంగిలించి బయటి వారికి తక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తులు పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్‌ను తీసి, దానిని కల్తీ చేసి అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పెట్రోల్ దోపిడీపై పలు ఆరోపణలు రావడంతో ఎస్ఓటీ పోలీసులు వలపన్ని వీరిని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also read: