Hyderabad: అప్పటికే పాతకక్షలు.. కట్‌చేస్తే, అమ్మాయి ఎంట్రీ.. దారుణంగా హత్య చేసి టపాసులు కాల్చారు

హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి వ్యాపారి సింగోటం రాము అలియాస్ రమణ అలియాస్ రామన్న దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఓ రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.

Hyderabad: అప్పటికే పాతకక్షలు.. కట్‌చేస్తే, అమ్మాయి ఎంట్రీ.. దారుణంగా హత్య చేసి టపాసులు కాల్చారు
Crime News

Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 09, 2024 | 11:59 AM

హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి వ్యాపారి సింగోటం రాము అలియాస్ రమణ అలియాస్ రామన్న దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఓ రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. మొత్తం పదిమంది కలిసి రామును అత్యంత దారుణంగా హత్యచేశారు. మర్మాంగాలను కోసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో మరికొంతమంది నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా పాలమూరు మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రాము అలియాస్ రామన్న కొల్లాపూర్ లో నివసిస్తుంటాడు. రాము కార్ డ్రైవర్ గా పని చేస్తూ జీడిమెట్లలో నివసిస్తూ స్థిరాస్తి వ్యాపారిగా మారాడు. అయితే, రాముకు మణి అని వ్యక్తితో గత పది సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో రాము మణీను అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మనీ తన మొహానికి తీవ్రంగా గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ సైతం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే, అది మనసులో పెట్టుకున్నటువంటి మణికంఠ.. రాముని హత్య చేయాలని కక్ష పెంచుకున్నాడు.

అనంతరం రాము కదలికలను పసిగట్టిన మణికంఠ.. యూసఫ్ గూడాలోని ఎల్ఎన్ నగర్లో ఓ మహిళ వద్దకు రాము తరచూ వస్తుండేవాడు.. ఆ మహిళ వ్యభిచారం చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ఆ మహిళ కూతురితో రాము పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండేవాడు. దీంతో సదరు మహిళకూతురు తనకి దగ్గర అయినటువంటి వ్యక్తితో ఈ విషయాన్ని తెలియజేసింది. ఆ తరువాత ఆ వ్యక్తి మణి స్నేహితుడు అవ్వడంతో యువతితో కాల్ చేయించి యూసఫ్ గూడలోని ఎల్ఎన్ నగర్ కు రామును రప్పించారు.

ఇంట్లోకి వెళ్లిన అనంతరం రాముపై ఇష్టానుసారంగా కత్తులతో దాడి చేశారు. అనంతరం .. రాము బావమరిదికి వీడియో కాల్ చేసి రాముని చంపేశాను.. అతనిని తీసుకొని వెళ్ళండి.. అంటూ సూచించారు. అయితే, దారుణ హత్య అనంతరం టపాసులను సైతం కాల్చాడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..