పాతబస్తీ ఓ శ్మశాన వాటికలో పదేళ్ల కింద పాతి పెట్టిన శవం .. శవంతో పాటు శవంపై కప్పిన దుప్పటి కూడా చెక్కు చెదరలేదంటూ.. బుధవారం ఓ వీడియో వైరలయ్యింది. పాతబస్తీ జహనుమ శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం గుంత తొవ్వుతుండగా పక్క సమాధికి పెద్ద రంధ్రం ఏర్పడింది. అందులోంచి శవం కనిపించింది. శవంపై కప్పిన బట్ట కూడా చీకి పోకుండా ఆలాగే ఉందని… డెడ్‌బాడీ కూడా కుళ్లిపోకుండా తాజాగా ఉన్నట్లు స్మశాన వాటిక నిర్వాహకులు తెలిపారు. ఆ సమాధి 10 ఏళ్ల క్రితం నాటిదని వారు గుర్తించారు. 10 ఏళ్లు అయినా శవం చెక్కు చెదరలేదని.. మృతి చెందిన వ్యక్తి దైవ చింతన కలిగిన వ్యక్తి గా, పుణ్యాత్ముడుగా ముస్లింలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. 10 ఏళ్ల క్రితం పాతిపెట్టిన శవం.. గంట క్రితం సమాధి చేసినట్టుగా ప్రెష్‌గా ఉండటమేంటని నెటిజన్లు నివ్వెరపోతున్నారు. దీని వెనుక మిస్టరీ ఏమై ఉంటుందా అని కుతూహలంగా ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ప్రత్యేకమైన కెమికల్స్ ఉపయోగించి మమ్మీలుగా మార్చిన మృతదేహాలు మాత్రమే ఎన్ని సంవత్సరాలు గడిచినా చెక్కుచెదరకుండా ఉంటాయి. అయితే ఈజీప్ట్‌లో మమ్మీలను తరచూ బయటపడుతూ ఉంటాయి.. మన దగ్గర ఇప్పటివరకూ అలాంటి ఘటనలు జరగలేదు. దీంతో ఈ డెడ్‌బాడీ తాజాగా ఉండటం వెనుక మర్మం ఏంటో అంతుబట్టకుండా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న డౌట్ ఏంటంటే.. సదరు వీడియోలో శవం దూరం నుంచి చూపించారే తప్ప.. లోపల్ చెక్ చేసి తాజాగా ఉందన్నది నిర్ధారించలేదు. వీడియోలో చూపించినదాని ప్రకారం.. క్లాత్ మట్టిలో కలవలేదు కాబట్టి పాడవ్వలేదు.. కానీ డెడ్‌బాడీని ఎవ్వరూ చెక్ చేసి కన్ఫామ్ చెయ్యలేదు కదా..! ఇదంతా ఫేక్ అని మరికొందరు కొట్టేస్తున్నారు.
Also Read:శుభలేఖ తెచ్చిన తిప్పలు.. ఆగిపోయిన పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే..?