Heavy Rains: ప్రయాణికులకు అలర్ట్.. భారీ వర్షాలతో 30 రైళ్లు రద్దు.. హైవేపై రాకపోకలు బంద్‌

|

Sep 01, 2024 | 10:02 AM

తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే ఏపీలోని 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. దీంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగాలు సహాయకచర్యల కోసం సన్నద్ధం అయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు, రైల్వే ట్రాక్‌లు చెరువులను తలపిస్తున్నాయి.

Heavy Rains: ప్రయాణికులకు అలర్ట్.. భారీ వర్షాలతో 30 రైళ్లు రద్దు.. హైవేపై రాకపోకలు బంద్‌
Trains cancelled
Follow us on

నాన్‌స్టాప్‌ వర్షాలతో తెలుగురాష్ట్రాలు అల్లాడుతున్నాయి. వానలు, వరదల బీభత్సం పెరుగుతున్నాయి.. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసంది.. రెండు తెలుగురాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే ఏపీలోని 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. దీంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగాలు సహాయకచర్యల కోసం సన్నద్ధం అయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు, రైల్వే ట్రాక్‌లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి.. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.. భద్రతా కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆదివారం, సోమవారంలో దాదాపు 30 వరకు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-కాజీపేట మార్గంలో 24 రైళ్లు నిలిపివేసింది.. సింహాద్రి, మచిలీపట్నం, గంగా-కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంత్‌పూర్ రైళ్లు నిలిపివేశారు..

ఇవి కూడా చదవండి

రద్దు, దారి మళ్లించిన ట్రైన్ల వివరాలు..

అంతేకాకుండా ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటుచేసింది..

హెల్ప్‌లైన్ నెంబర్లు

సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.. పలు మార్గాల్లో రైలు పట్టాలమీదకు నీళ్లు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.

ఇదిలాఉంటే.. భారీ వర్షాలతో NH-16పై కూడా రాకపోకలు బంద్‌ అయ్యాయి. నల్లగొండ, కృష్ణా జిల్లాలలో రికార్డు వర్షాలతో వరద బీభత్సం కొనసాగుతోంది.. దీంతో NH-16పై రాకపోకలు బంద్‌ చేశారు. ట్రాఫిక్‌ ను పలు మార్గాల్లో మళ్లిస్తున్నారు.

ఇది కూడా చదవండి..

బయటకు రాకండి.. ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..