పార్కింగ్ బిల్లు చూస్తే.. గుండె బేజారు!

| Edited By: Srinu

Aug 28, 2019 | 1:04 PM

బండి పార్కింగ్‌లో పెట్టకుండా వెళ్తే.. పోలీసులు ఫైన్ వేస్తారు. పోనీ బండిని పార్కింగ్‌లో పెడదామనుకుంటే అడ్డగోలుగా దోచేస్తున్నారు. 12 గంటలకు గానూ పార్కింగ్ బిల్లు రూ. 100 లేక రూ.150 ఉంటుందని అనుకుంటే.. జీఎస్టీతో కలిపి గంటకు రూ.47 చొప్పున ఏకంగా 12 గంటలకు రూ.564 పడుతోంది. ఇలా ప్రతిరోజూ రైల్వే ప్రయాణీకులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. రైల్వేస్టేషన్‌ మొదటిగేటు వద్ద ఉన్న పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ వసూలు చేస్తున్న చార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఇక్కడ ఒక మోటారు సైకిల్‌ను […]

పార్కింగ్ బిల్లు చూస్తే.. గుండె బేజారు!
Follow us on
బండి పార్కింగ్‌లో పెట్టకుండా వెళ్తే.. పోలీసులు ఫైన్ వేస్తారు. పోనీ బండిని పార్కింగ్‌లో పెడదామనుకుంటే అడ్డగోలుగా దోచేస్తున్నారు. 12 గంటలకు గానూ పార్కింగ్ బిల్లు రూ. 100 లేక రూ.150 ఉంటుందని అనుకుంటే.. జీఎస్టీతో కలిపి గంటకు రూ.47 చొప్పున ఏకంగా 12 గంటలకు రూ.564 పడుతోంది. ఇలా ప్రతిరోజూ రైల్వే ప్రయాణీకులు నిలువుదోపిడీకి గురవుతున్నారు.
రైల్వేస్టేషన్‌ మొదటిగేటు వద్ద ఉన్న పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ వసూలు చేస్తున్న చార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఇక్కడ ఒక మోటారు సైకిల్‌ను పార్క్‌ చేస్తే.. జీఎస్టీతో కలిపి గంటకు రూ. 18.. రోజుకు రూ. 425 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే కారుకైతే గంటకు రూ. 47 చొప్పున పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రతి గంటకు అదే మొత్తంలో ఫీజును పెంచుతూ పోతున్నారు. సగటు ప్రయాణీకుడు దూర ప్రాంతానికి వెళ్లే రైలు చార్జీ కంటే.. బండి పార్కింగ్ బిల్లు భారీగా ఉండటంతో వారిని షాక్‌కు గురి చేస్తోంది.
రైల్వే అధికారుల ప్రమేయం లేకపోవడం వల్లే పార్కింగ్ కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాము నిబంధనలు ప్రకారమే పార్కింగ్ ఫీజులు తీసుకుంటున్నామని.. అలా తీసుకోకపోతే తమ టెండర్లు రైల్వే అధికారులు రద్దు చేస్తారని పార్కింగ్ కాంట్రాక్టర్ ఒకరు వివరించారు.