కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు బెయిల్ మంజూరు.. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని షరతు..!

|

Jan 23, 2021 | 6:38 PM

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు.. షరతులతో బెయిల్‌ లభించింది.

కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు బెయిల్ మంజూరు.. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని షరతు..!
Follow us on

Bail grant to Akhila Priya : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు.. షరతులతో బెయిల్‌ లభించింది. ఇవాళ చంచల్‌గూడ మహిళా జైలు నుంచి ఆమె విడుదల అయ్యారు. కిడ్నాప్ కేసుకు సంబంధించి విచారన చేపట్టిన సికింద్రాబాద్‌ కోర్టు..10వేల పూచికత్తుతో ఇద్దరి ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది.దీంతో అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతీ సోమవారం అఖిలప్రియ బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

అటు.. అఖిలప్రియ విడుదల నేపథ్యంలో ఉదయం నుంచి చంచల్‌గూడ జైలు వద్ద సందడి కనిపించింది. అఖిలప్రియ వర్గీయులు, ఆమె బంధువులతో పాటు కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం నేతలు భారీగా చేరుకున్నారు. అఖిలప్రియ విడుదల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు దగ్గర అభిమానులు నిరీక్షించారు. ఇదిలావుంటే, హైదరాబాద్‌ విడిచి ఎక్కడికి వెళ్లడానికి వీలులేదని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఇక్కడే ఉండనున్నారు. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్నారు.

ఇదీ చదవండిః ఏపీలో ఎటూ తేలని ‘పంచాయితీ’.. ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు.. రాష్ట్రస్థాయి సమావేశానికి అధికారుల గైర్హాజరు