Special Train: వరుస సెలవుల కారణంగా ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి గుంటూరుకు అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలును నడపనుంది. ఈ ప్రత్యేక రైలు (నెం.07515) ఆగస్టు 14న (ఆదివారం) సాయంత్రం 06.30 గం.లకు హైదరాబాద్ నుండి బయలుదేరి రాత్రి 11.40 గం.లకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, మౌలాలి, చెర్లపల్లి, ఘట్‌కేశర్, బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
ఈ ప్రత్యేక రైలులో మొత్తం 16 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలులో ప్రయాణించేందుకు ఎలాంటి రిజర్వేషన్లు ఉండదని ద.మ.రైల్వే అధికారులు శనివారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ – గుంటూరు ప్రత్యేక రైలు వివరాలు..
Hyderabad – Guntur Unreserved One Way Special Train @drmsecunderabad @drmgnt pic.twitter.com/sLTwG8xx0a
— South Central Railway (@SCRailwayIndia) August 13, 2022
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..