Road Accident: తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకెళితే.. కేపీహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ.. ముందుగా వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మియాపూర్ నుంచి జేఎన్‌టీయూ వైపు వెళ్తున్న ఆది రేష్మి అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఆర్‌డీఓ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న పి. ప్రశాంత్ అనే యువకుడు ఘటనా స్థలం లోనే ప్రాణాలు వదిలాడు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రశాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Engine Failure: అమెరికాలో గాల్లోనే విమాన ఇంజన్ ఫెయిల్యూర్, నగరంలో పడిన శిథిలాలు, ప్రయాణికులు క్షేమం