సికింద్రాబాద్-విశాఖపట్నం(20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో పలు మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. వాస్తవానికి ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో బుధవారం(జూన్ 14) మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే రాత్రి 7 గంటలకు బయల్దేరేలా రీ-షెడ్యూల్ చేసింది రైల్వే శాఖ. ఇవాళ ఉదయం విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు 3 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా.. పెయిరింగ్ ట్రైన్ అయిన సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ కూడా 4 గంటలు లేటుగా రాత్రి 7 గంటలకు పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే.. బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు తాడి-అనకాపల్లి మార్గంలో బొగ్గు లోడ్‌తో వస్తోన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-విజయవాడ మధ్య ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలోనే జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను ఇవాళ రద్దు చేసి.. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 3 గంటల ఆలస్యంగా నడుపుతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కాగా, ట్రాక్ పునరుద్దరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
*Rescheduling of Vande Bharat Express today
Train No. 20834 Secunderabad – Visakhapatnam Vande Bharat Express scheduled to depart SC at 15.00 hrs on 14.06.2023 is rescheduled to depart at 19.00 hrs on the same day @drmvijayawada @drmsecunderabad— South Central Railway (@SCRailwayIndia) June 14, 2023