న్యూఇయర్ వస్తోందంటే చాలు.. ఆ జోష్‌తో యువత సంబురాల్లో మునిగిపోవడం సర్వసాధారణం. కొత్త సంవత్సరం.. అది కూడా డిసెంబర్ 31వ తేదీ నైట్ పార్టీ అంటేనే వేరే లెవెల్.. లిక్కర్ ఏరులై పారుతుంది. ఈ నేపధ్యంలో నేడు లిక్కర్ విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఒక్క రోజే రూ. 104 కోట్ల మద్యం అమ్ముడైంది. ఇదిలా ఉంటే డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల కేసుల మద్యం.. 34 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.
మరోవైపు తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. డిసెంబర్ నెలలో సుమారు రూ. 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నెల చివరి నాలుగు రోజుల్లోనే రూ. 545 కోట్ల మద్యం అమ్ముడైంది. గత ఏడాది డిసెంబర్‌లో రూ. 2,764 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
Also Read: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..