Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..

అమ్మాయిలను ఆకట్టుకునేందుకు అబ్బాయిలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. కిందా మీద పడుతూ వారి కళ్లలో పడేందుకు...

Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 30, 2021 | 9:45 PM

అమ్మాయిలను ఆకట్టుకునేందుకు అబ్బాయిలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. కిందా మీద పడుతూ వారి కళ్లలో పడేందుకు ఎన్నో చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేస్తుంటారు. అవి సక్సెస్ అయితే బాగానే ఉంటుంది గానీ.. ఫెయిల్ అయితే మాత్రం బొక్కబోర్లాపడటం ఖాయం. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.! ఓ యువకుడు అమ్మాయిని ఆకర్షించేందుకు స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాటర్ ఫౌంటెన్ రెయిలింగ్‌పై ఓ యువకుడు సైకిల్‌ తొక్కుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఎదురుగా ఓ అమ్మాయి షూ లేస్ సరి చేసుకుంటోంది. ఇక ఆమెను చూసిన మనోడు స్టంట్ చేయాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆమెపై నుంచి సైకిల్‌తో ఎగరాలని ప్రయత్నిస్తాడు. అంతే.. సైకిల్ కాస్తా బ్యాలెన్స్ తప్పడం.. దానితో సహా అతడు ఆమెపై పడిపోవడం క్షణాల్లో జరుగుతుంది. చూస్తుంటే ఈ స్టంట్‌లో అబ్బాయి కంటే అమ్మాయికే ఎక్కువ దెబ్బలు తగిలి ఉంటాయి.

కాగా, ఈ వీడియోను ‘mohd_junaid_ch77’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్‌లోడ్ చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. అలాగే కొంతమంది ‘పాపం ఆ అమ్మాయికి గట్టిగా దెబ్బలు తగిలి ఉంటాయి’ అంటూ బాధపడ్డారు. ఏది ఏమైనా ఈ వీడియో చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే