Hyderabad: పార్ట్‌టైం జాబ్‌గా ర్యాపిడో నడుపుతున్నారా.? మీకో గుడ్ న్యూస్.. ఇకపై డబ్బే డబ్బు.!

|

May 26, 2023 | 1:30 PM

Rapido, Hyderabad: హైదరాబాద్‌లోని చాలామంది యువత పార్ట్‌టైం జాబ్‌గా ర్యాపిడో నడుపుతుంటారు. ఇక అలాంటివారి కోసం సదరు సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ర్యాపిడో బైక్, ట్యాక్సీ కెప్టెన్లకు మరింత ఆదాయం సమకూర్చే దిశలో..

Hyderabad: పార్ట్‌టైం జాబ్‌గా ర్యాపిడో నడుపుతున్నారా.? మీకో గుడ్ న్యూస్.. ఇకపై డబ్బే డబ్బు.!
Rapido
Follow us on

హైదరాబాద్, మే 26: హైదరాబాద్‌లోని చాలామంది యువత పార్ట్‌టైం జాబ్‌గా ర్యాపిడో నడుపుతుంటారు. ఇక అలాంటివారి కోసం సదరు సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ర్యాపిడో బైక్, ట్యాక్సీ కెప్టెన్లకు మరింత ఆదాయం సమకూర్చే దిశలో భాగంగా రేట్ కార్డును సవరించినట్లు సదరు సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి వెల్లడించారు. ఇకపై 8 కిలోమీటర్ల వరకు కిలోమీటర్‌కు రూ.8 చొప్పున, ఆపైన రూ. 11 చొప్పున రేట్లను నిర్ణయించింది. దీంతో ఇతర ఈ-కామర్స్ సంస్థలతో పోలిస్తే ర్యాపిడో కెప్టెన్లు ఒక్కో ఆర్డర్‌కు కనీసం రూ. 60 ఆదాయాన్ని పొందగలరని పవన్ తెలిపారు. మిగతా ప్లాట్‌ఫామ్‌లపై ఇది రూ. 40-45 ఉండగా.. ఈ కొత్త రేట్ కార్డుతో ర్యాపిడో కెప్టెన్లకు రూ. 60 ఆదాయం వస్తుందన్నారు.

అటు కెప్టెన్లకు ట్రిప్స్‌పై మరింత నియంత్రణ ఉండేలా సరికొత్త ఫీచర్‌ను కూడా యాప్‌కు జోడిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ముందుగానే రైడర్ల గమ్యస్థానాల గురించి బైక్ కెప్టెన్లకు తెలుస్తుందన్నారు. ఇంతకముందు ఈ ఫీచర్ లేదని.. ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. దీని ద్వారా బుకింగ్ క్యాన్సిలేషన్లు తగ్గడంతో పాటు రైడర్లు, కెప్టెన్లకు ప్రయోజనకరంగా ఉంటుందని పవన్ గుంటుపల్లి తెలిపారు.(Source)