Telangana: ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదే.!

|

Apr 01, 2023 | 11:17 AM

ప్రజలకు ముఖ్య అలెర్ట్. తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో..

Telangana: ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదే.!
Heavy Rain
Follow us on

ప్రజలకు ముఖ్య అలెర్ట్. తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఒకట్రెండు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడమే కాకుండా, పిడుగులు పడే అవకాశమే కూడా ఉందని ప్రజలను అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ.

అటు శుక్రవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. రానున్న మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షం ముంచెత్తడంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. అలాగే . అటు భద్రాచలంలో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో.. లక్ష్మీనర్సింహస్వామి ఆలయంపై పిడుగుపటడంతో ధ్వజస్తంభం దెబ్బతింది.