Hyderabad: రా రమ్మంటోన్న’రైల్ కోచ్ రెస్టారెంట్’.. నగరంలో మరో వండర్..! సందర్శకుల సందడి షురూ..

| Edited By: Jyothi Gadda

Sep 11, 2023 | 6:52 PM

Hyderabad: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన ఈ కోచ్ రెస్టారెంట్ చొరవ వినియోగదారులకు మరపురాని భోజన అనుభవాన్ని అందించడంతో పాటు పాక శాస్త్రం లోని ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. రైల్వేలు చేపడుతున్నఈ వినూత్న సౌకర్యాన్ని రైలు వినియోగదారులు, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Hyderabad: రా రమ్మంటోన్నరైల్ కోచ్ రెస్టారెంట్.. నగరంలో మరో వండర్..! సందర్శకుల సందడి షురూ..
Rail Coach Restaurant
Follow us on

హైదరాబాద్, సెప్టెంబర్11: రైలు ప్రయాణికులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే దిశగా మరో అడుగు వేస్తూ, దక్షిణ మధ్య రైల్వే (SCR) జంట నగరాల్లోని మరో ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లో తన వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా SCR సికింద్రాబాద్ డివిజన్ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో ‘రైల్ కోచ్ రెస్టారెంట్’ను సోమవారం ప్రారంభించింది. ఇది ప్రత్యేకమైన భోజన వాతావరణం ద్వారా ఆహార ప్రియులకు వినూత్న అనుభూతిని అందిస్తుంది. రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించడానికి నిరంతర ప్రయత్నంలో దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన మరో వినూత్న ముందడుగు అంటున్నారు. ఇంతకుముందు కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించిన “రెస్టారెంట్ ఆన్ వీల్స్” తర్వాత ఇది తెలంగాణలో రెండవ కోచ్ రెస్టారెంట్.

సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లో తన వినూత్న కార్యక్రమాలలో భాగంగా రైలు రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడానికి పూనుకుంది దక్షిణ మధ్య రైల్వే. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్‌లోని నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆహార ప్రియులకు ప్రత్యేకమైన భోజన వాతావరణాన్ని, వారికి ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి “రైల్ కోచ్ రెస్టారెంట్” ను ప్రారంభించింది.

నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ జంట నగరాల సబర్బ్ నెట్‌వర్క్‌లోని అత్యంత రద్దీగా ఉండే రైలు స్టేషన్‌లలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చాలా వినోదాత్మకమైన ప్రదేశాలను కలిగి ఉండటం వల్ల ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులకు సేవాలందిస్తుంది. జంట నగరాల ఆహార ప్రియులకు అసమానమైన భోజన అనుభూతిని అందించడానికి, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్‌ను కోచ్ రెస్టారెంట్ భావనతో ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసింది రైల్వే శాఖ. దీని కోసం వాడుకలో లేని ఒక రైలు కోచ్‌ని ప్రయాణీకులకు ప్రత్యేకమైన భోజన అనుభూతిని అందించడానికి పూర్తిగా ఆధునిక, అంతర్గతoగా సుందరంగా తీర్చిదిద్దారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్‌లోని “రైల్ కోచ్ రెస్టారెంట్” ఐదు సంవత్సరాల కాలానికి హైదరాబాద్ కి చెందిన మెసర్స్ బూమరాంగ్ రెస్టారెంట్ వారికి కేటాయించబడింది.

ఇవి కూడా చదవండి

ఈ బహుళ వంటకాల రెస్టారెంట్ రైలు ప్రయాణీకులకు, సామాన్య ప్రజలకు భోజన అవకాశాన్ని కల్పించడానికి, స్టేషన్ పరిసర ప్రాంగణంలోని ఖాళీస్థలంలో ప్రారంభించారు. ఈ బహుళ వంటకాల రెస్టారెంట్ వినియోగదారులకు స్నాక్స్,  భోజనం కూడా  అక్కడే  అందుబాటులో ఉంచుతుంది. కావాలంటే ఇంటికి తీసుకెళ్లేందుకు  పార్శిల్ సదుపాయాన్నిఅందిస్తుంది. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన ఈ కోచ్ రెస్టారెంట్ చొరవ వినియోగదారులకు మరపురాని భోజన అనుభవాన్ని అందించడంతో పాటు పాక శాస్త్రం లోని ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ప్రత్యేకమైన చొరవతో ఉపయోగించని కోచ్‌ని సుందరమైన రెస్టారెంట్ గా మార్పు చేసినందుకు సికింద్రాబాద్ డివిజన్ను ఆయన అభినందించారు. జంట నగరాల్లోని ఆహార ప్రియులకు, ఈ జంటనగర ప్రాంతంలో మరోక విలక్షణమైన ఆహారానికి సంబందించిన ఎంపిక లభ్యమౌతుందని ఆయన తెలియజేశారు. రైల్వేలు చేపడుతున్నఈ వినూత్న సౌకర్యాన్ని రైలు వినియోగదారులు, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..