‘ఎల్లపుడూ..మీకొరకు.., మీతో…’ అనే నినాధంతో రాచకొండ షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, నిర్భయంగా, నిశ్చింతగా బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా సంప్రదించవచ్చని రాచకొండ మహిళ రక్షణ విభాగం అధిపతి డీసీపీ టి. ఉషా విశ్వనాథ్ తెలిపారు. 15 రోజుల్లో 126 మంది ఆకతాయిలను రాచకొండ టీ షీమ్స్ పట్టుకున్నారు. బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని డీసీపీ ఉషా విశ్వనాథ్ తెలిపారు.
బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు. రాచకొండ కమిషనర్ శ్రీ డి.ఎస్. చౌహాన్, ఐపిఎస్ గారి ఆదేశాల ప్రకారం.. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 126 మందిని (మేజర్స్-58, మైనర్స్ -68) అధికారులు అరెస్ట్ చేవారు. వీరికి ఎల్‌బీనగర్ సీపీ క్యాంప్ ఆఫీస్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల అక్టోబర్ 16 నుంచి 31 వరకు 148 ఫిర్యాలు అందాయని టి. ఉషా విశ్వనాథ్ గారు తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు.
ఇదిలా ఉంటే ఈవ్ టీజింగ్‌పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గత నె అక్టోబర్ 16వ తేదీ నుంచి 31 వరకు రాచకొండ షీ టీమ్స్ మొత్తం 53 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 4160 మందికి మహిళలకు చట్టాలతో పాటు వారికి లభించే హక్కుల గురించి వివరించి, అవగాహన కల్పించారు. పోకిరీల ఆటకట్టేందుకు మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి.. మహిళా కంపార్మెంట్‌లోకి వెళ్లి ప్రయాణిస్తున్న ఆరు మందిని పట్టుకుని మెట్రో స్టేషన్ అధికారుల ద్వారా ఫైన్ వేశారన్నారు.
ఇక కుషాయుగూడ షీటీమ్.. కుషాయిగూడ ఏరియాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రోడ్డు మీద వెలుతున్న మహిళను, ఆడపిల్లలను వేదిస్తున్న 25 మంది పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే వనస్థలిపురం, మల్కాజ్-గిరి ఏరియాల్లో కూడా డెకాయర్ ఆపరేషన్ నిర్వహించి మహిళను, ఆడ పిల్లలను వేధిస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆడవారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా, వేధింపులు ఎదురైనా.. రక్షించేందుకు రాచకొండ పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపార. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మహిళలు వేధింపులకు గురైతే వెంటనే రాచకొండ వాట్సాప్ నెంబర్ 8712662111, లేదా ప్రాంతాల వారిగా భువనగిరి ఏరియా- 8712662598, చౌటుప్పల్ – 8712662599, ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ ఏరియా -8712662601, ఎల్బీ నగర్ ఏరియా -8712662602, మల్కాజిగిరీ ఏరియా -8712662603, వనస్థలిపురం ఏరియా -8712662604 నెంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..