AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. చిల్లర సమస్యకు చెక్‌..

రైల్వే ప్రయాణికులకు సేవలను మరింత మెరుగుపరిచే దిశగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు కొనుగోలు చేసే సమయంలో నగదు చెల్లింపులకు తావు లేకుండా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టెకెట్లు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. తొలిదశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే లోని కొన్ని ప్రధాన స్టేషన్లలో ప్రవేశపెట్టిన సౌకర్యాన్ని...

SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. చిల్లర సమస్యకు చెక్‌..
SCR
Narender Vaitla
|

Updated on: Aug 14, 2024 | 5:47 PM

Share

రైల్వే ప్రయాణికులకు సేవలను మరింత మెరుగుపరిచే దిశగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు కొనుగోలు చేసే సమయంలో నగదు చెల్లింపులకు తావు లేకుండా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టెకెట్లు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. తొలిదశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే లోని కొన్ని ప్రధాన స్టేషన్లలో ప్రవేశపెట్టిన సౌకర్యాన్ని ఇప్పుడు జోన్‌లోని అన్ని స్టేషన్‌లకు విస్తరించనున్నారు.

దక్షిణ మధ్య రైల్వే వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు నగదు లావాదేవీలను తగ్గించడానికి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే జనరల్ బుకింగ్ అండ్‌ రిజర్వేషన్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులను పెంచడానికి, దక్షిణ మధ్య రైల్వే టిక్కెట్ల కొనుగోలు కోసం క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా టిక్కెట్ ఛార్జీని చెల్లించే అదనపు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ప్రయాణికులు టికెట్‌ కొనుగోలు చేసే సమయంలో చిల్లర సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

ఇప్పటికే జోన్‌లోని అన్ని స్టేషన్స్‌లోని టికెటింగ్ కౌంటర్లలో టిక్కెట్ విండో వెలుపల ప్రత్యేక పరికరాలు అందించారు. టిక్కెట్‌ను జారీ చేయడానికి సంబంధించిన అన్ని వివరాలను సిస్టమ్‌లోకి నమోదుచేసిన తర్వాత, చెల్లింపును అంగీకరించే ముందు, ఈ పరికరాలలో క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే అవుతుంది. దీంతో ప్రయాణికులు తమ యాప్స్‌ ద్వారా స్కాన్ చేసి పే చేస్తో సరిపోతుంది. పేమెంట్ పూర్తి కాగానే వెంటనే టికెట్ జారీ చేస్తారు.

తొలి దశలో భాగంగా రైల్వే వినియోగదారులకు ఈ నగదు రహిత లావాదేవీల సౌలభ్యాన్ని ముందుగా ముఖ్యమైన స్టేషన్లలోని ప్రధాన కౌంటర్లలో అందుబాటులోకి తీసుకురాగా, ఆ తర్వాత అన్ని స్టేషన్స్‌లోని కౌంటర్లకు విస్తరించనున్నారు. కౌంటర్లలో ఏర్పాటుకు అవసరమైన పరికరాలు అన్ని స్టేషన్లకు సరఫరా చేశారు. ఇప్పటికే చాలా వరకు స్టేషన్స్‌లో వీటిని ఇన్‌స్టాల్‌ చేశారు.

ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. ప్రయాణికులు తమ టిక్కెట్లను కౌంటర్లలో కొనుగోలు చేసేందుకు డిజిటల్ చెల్లింపుల ఎంపికను ప్రవేశపెట్టిన కమర్షియల్ అండ్‌ టెక్నికల్ స్టాఫ్ చేస్తున్న కృషిని అభినందించారు. రైలు వినియోగదారులందరూ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కారు చాలా కాలం పాటు పార్క్‌ చేసి ఉంచితే ఈ భాగాలు దెబ్బతింటాయట..!
కారు చాలా కాలం పాటు పార్క్‌ చేసి ఉంచితే ఈ భాగాలు దెబ్బతింటాయట..!
ఫిఫా వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే 3 రెడ్ కార్డ్‌లు
ఫిఫా వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే 3 రెడ్ కార్డ్‌లు
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!
ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..
ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..
మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..
మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..
పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..
పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్
ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీపై ఇంత రహస్యం ఉంటుందా?
ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీపై ఇంత రహస్యం ఉంటుందా?
ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి..చివరికి ఇలా
ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి..చివరికి ఇలా