Hyderabad: సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద రణరంగం.. ఎక్కడికక్కడ అరెస్టులు.. లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం!

|

Jul 16, 2024 | 8:12 AM

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ వాయిదాతోపాటు, గ్రూప్‌ 2,3 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిరసనకారులను అరెస్టు చేయడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గ్రూప్‌ 2,3 పోస్టులు పెంచాలని పెద్ద ఎత్తున అభ్యర్ధులు సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్దకు చేరుకుని, నిరసన తెలిపారు..

Hyderabad: సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద రణరంగం.. ఎక్కడికక్కడ అరెస్టులు.. లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం!
Protest At Chikkadpally Library
Follow us on

హైదరాబాద్‌, జులై 16: హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ వాయిదాతోపాటు, గ్రూప్‌ 2,3 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిరసనకారులను అరెస్టు చేయడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గ్రూప్‌ 2,3 పోస్టులు పెంచాలని పెద్ద ఎత్తున అభ్యర్ధులు సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్దకు చేరుకుని, నిరసన తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ తీస్తామని పోలీసులను కోరినా వారు నిరాకరించారు. లైబ్రరీ మెయిన్‌ గేటు దాటి బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో లైబ్రరీ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన 20 మంది అభ్యర్ధులను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. వారందరినీ చాంద్రాయణగుట్ట, బొల్లారం పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. వీరిలో ఇద్దరు మహిళా అభ్యర్థులు సైతం ఉన్నారు.

గేటు బయటకు వెళ్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తుంటో.. మరికొందరు లోపలే ఉండి ఆందోళన కొనసాగించారు. గ్రూప్‌ 2,3 పోస్టులు పెంచాలని, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులతో పాటు స్పెషల్‌ టీం పోలీసులు గేటు లోపలికి వెళ్లి.. లోపలున్న నిరసనకారులను కూడా అరెస్ట్‌ చేశారు. పోలీసుల చర్యలకు భయపడిన అభ్యర్థులు లైబ్రరీ భవనంలోపలికి వెళ్లి, గ్రిల్‌ వేసుకున్నారు. లైబ్రరీలోనికి పోలీసులు ఎలా అడుగుపెడతారో చూస్తాం అని అన్నారు. రాత్రి భోజనం చేసేందుకు వెళ్తున్న అభ్యర్థులను కూడా.. దొరకపుచ్చుకుని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్టును కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 1 నుంచి ‘గేట్‌-2025’ పరీక్షలు

దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2025’ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈసారి గేట్‌ 2025 ఆన్‌లైన్‌ పరీక్షలను ఐఐటీ రూర్కీ నిర్వహించనుంది. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న బీఏ, బీకాం, బీఎస్‌సీ విద్యార్థులూ ఈ పరీక్ష రాయొచ్చు. గేట్‌ స్కోర్‌తో ఎంటెక్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.12,400ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. ఐఐటీలు పీహెచ్‌డీలో ప్రవేశాలకు గేట్‌ స్కోర్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.