BJP: అవినీతి నిర్మూలనే మా లక్ష్య్ం.. దాడులు చేస్తే ఊరుకోం.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కామెంట్స్

|

Jul 02, 2022 | 8:00 PM

అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smrithi Irani) అన్నారు. హైదరాబాద్ లోని (Hyderabad) హెచ్‌ఐసీసీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆమె.. కేరళ, పశ్చిమ బెంగాల్‌, కశ్మీర్‌లోని...

BJP: అవినీతి నిర్మూలనే మా లక్ష్య్ం.. దాడులు చేస్తే ఊరుకోం.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కామెంట్స్
Smrithi Irani
Follow us on

అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smrithi Irani) అన్నారు. హైదరాబాద్ లోని (Hyderabad) హెచ్‌ఐసీసీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆమె.. కేరళ, పశ్చిమ బెంగాల్‌, కశ్మీర్‌లోని బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వారికి జేపీ నడ్డా ధైర్యం చెప్పారని, ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. సమాజ బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశంలో త్యాగమూర్తులకు శ్రద్ధాంజలి ఘటించారు. పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం మోడీ నాయకత్వంలో గత 8 సంవత్సరాలలో చేసిన కృషిని ప్రశంసించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ నినాదాన్ని సాకారం చేసేందుకు.. జనధన్ యోజన, బీమా, కిసాన్ సమ్మాన్ నిధి వంటి సామాజిక భద్రత, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉన్నతికి ఎన్నో పథకాలు చేపట్టినట్లు వివరించారు. కరోనా సమయంలొ ఫ్రంట్ లైన్ వారియర్స్ చేసిన సేవలను అభినందించారు. 25 నెలల పాటు 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహార భద్రత అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు.

వ్యాక్సినేషన్లో ప్రపంచ పటంలో భారత్ ను అగ్రభాగాన నిలిపాం. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆదివాసీ దళిత మహిళ ద్రౌపదీ ముర్మును ప్రకటించాం. దీంతో బలహీన వర్గాలకు మేమెంత ప్రాధాన్యత ఇస్తున్నామొ అర్థమవుతోంది. గోవా, మణిపూర్, యూపీ రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు, కశ్మీర్ వేర్పాటు వాదుల చేతిలో ప్రాణాల కోల్పోయిన కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివి. దేశాన్ని తప్పుదోవ పట్టించేందు విపక్షాల ప్రయత్నిస్తున్నాయి.

      – బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలోని ముఖ్యాంశాలు

ఇవి కూడా చదవండి

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరుగా కేసీఆర్ నిలిచారని జేపీ నడ్డా అన్నారు. ప్రధాని తెలంగాణకు వస్తే కేసీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా ఉల్లంఘించారని, కేసీఆర్ విధానాలను దేశం ఎప్పటికీ ఆమోదించదని మండిపడ్డారు. అవినీతి కుటుంబ పాలనకు మరో పేరు టీఆర్ఎస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలనను దేశం ఎప్పుడు ఆమోదించదని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలను తాము ఫాలో కామని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.