Statue of Equality: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శ్రీరామనగరానికి విచ్చేశారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతోపాటు భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరించనున్నారు. శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి రామ్‌నాథ్‌కోవింద్‌కి మంగళాసీస్సులు ఇస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 3.30 గంటలకు ముచ్చింతల్ శ్రీరామనగరానికి చేరుకుంటారు. ఆ తర్వాత శ్రీరామానుజాచార్యుల స్వర్ణవిగ్రహ ఆవిష్కరణ, సమతామూర్తి భారీవిగ్రహాన్ని సందర్శిస్తారు. సహస్రాబ్ది సమారోహంలో భాగంగా శ్రీరామనగరంలో రాష్ట్రపతి ప్రత్యేకపూజలతోపాటు 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు చినజీయర్ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి బస చేసిన తర్వాత…రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
ప్రెసిడెంట్ టూర్ సందర్భంగా ముచ్చింతల్ ఆశ్రమంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఆశ్రమంలో ఉండే 2 గంటలు విఐపీలు, వివిఐపీలు, ఐడీకార్డులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీసులు భద్రతను సమీక్షిస్తున్నారు.
రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్ స్వామికి, మైహోం రామేశ్వర రావుకు రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్దేశించారని చెప్పారు. 108 దివ్యదేశాల ఏర్పాటుతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందన్నారు. ఈ క్షేత్రం ఏర్పాటుతో తెలంగాణలో కొత్త సాంస్కృతిక జీవనం మొదలైందని పేర్కొన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్‌లోని సమతామూర్తిని సందర్శించుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని, అధికారులు ఉన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరాన్ని సందర్శించారు. 120 కిలలో స్వర్ణ రామానుజాచార్యుల విగ్రహాన్ని రామ్‌నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్‌లోని సమతామూర్తిని సందర్శించుకోనున్నారు. ఆయనతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని, అధికారులు ఉన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్‌కు చేరుకున్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింది బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు బయల్దేరారు. అంతకు ముందు ఆయనకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి కాసేపట్లో హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు వెళ్లనున్నారు.
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కాసేపట్లో శ్రీరామనగరానికి విచ్చేయనున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు.
ఇవాళ 20 దివ్యదేశాల ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. అనంతరం స్వామివారితోపాటు మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబసభ్యులు కలిసి ఆలయ గోపురానికి కలశ పూజ చేశారు. పవిత్రమైన గోమాత పాలతో జయజయధ్వానాల మధ్య కలశపూజను వైభవంగా నిర్వహించారు.
శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి సమారోహ ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి. ఈ ఉదయం సువర్ణ పుష్పార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. విజయ ప్రాప్తికోసం విశ్వక్సనేష్టి, జ్ఞానజ్ఞానకృత సర్వవిధపాప నివారణకై శ్రీమన్నారాయణేష్టి నిర్వహిస్తున్నారు.