Telangana: ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.. కరోనా కేసులు పెరిగితే పొడిగింపే..!

|

Jan 03, 2022 | 10:10 PM

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం నిర్ణయించారు.

Telangana: ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.. కరోనా కేసులు పెరిగితే పొడిగింపే..!
Cm Kcr
Follow us on

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం నిర్ణయించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు.

ఒమిక్రాన్ దృష్ట్యా సంక్రాంతి సెలవులు ముందుగానే ఇచ్చారు. అయితే సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కరోనా పరిస్థితులను బట్టి విద్యాసంస్థలు తెరవనున్నారు. ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే సెలవులు ముందుగానే ప్రకటించారు.  సోమవారం తెలంగాణలో 482 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Reat Also.. SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ న్యూ ఇయర్‌ ఆఫర్‌.. కేవలం నాలుగు క్లిక్స్‌తోనే పర్సనల్ లోన్‌.. పూర్తి వివరాలు..