Hyderabad: బార్లు, పబ్‌లలో వారిని అనుమతిస్తే కేసులు.. న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు..

|

Dec 29, 2024 | 7:32 PM

న్యూ ఇయర్‌ జోష్‌ మొదలైంది.. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. హైదరాబాద్‌లోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్, హోటల్స్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.. అంతేకాకుండా.. పలు కీలక సూచనలు చేస్తున్నారు..

Hyderabad: బార్లు, పబ్‌లలో వారిని అనుమతిస్తే కేసులు.. న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు..
Hyderabad Police
Follow us on

న్యూ ఇయర్‌ జోష్‌ మొదలైంది.. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. హైదరాబాద్‌లోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్, హోటల్స్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తనిఖీలు చేస్తున్నారు.. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. బార్లు, పబ్‌ల లైసెన్స్‌లు తనిఖీ చేస్తున్న పోలీసులు.. పలు సూచనలు చేస్తున్నారు.. ఎప్పటివరకు అనుమతులు ఉన్నాయి.. ఎలాంటి రక్షణ సౌకర్యాలు ఉన్నాయి.. తదితర వివరాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.. డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. పలు కీలక ఆదేశాలిచ్చారు.

బార్లు, పబ్‌లలో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. అలాగే.. బార్లు, పబ్‌ల్లోకి మైనర్లను అనుమతిస్తే కేసులు పెడతామని పోలీసులు పేర్కొన్నారు.. సౌండ్ పొల్యూషన్‌తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలని పబ్ యజమానులకు ఆదేశాలిచ్చారు.. డ్రగ్స్, గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలు అనుమతిస్తే కఠిన చర్యలు ఉంటాయని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

వీడియో చూడండి..

మరోవైపు న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు హైదరాబాద్‌ పోలీసులు.. జూబ్లీహిల్స్‌లో 30పబ్‌లలో మాత్రమే న్యూఇయర్ వేడుకలకు అనుమతి ఇచ్చారు. 4 పబ్‌లలో న్యూఇయర్‌ వేడుకలకు అనుమతి నిరాకరించారు. గతంలో జరిగిన గొడవల కారణంగా ఆ పబ్‌లలో వేడుకలకు నో చెప్పారు. అనుమతి ఇచ్చిన పబ్‌లలో కూడా అర్ధరాత్రి ఒంటిగంటలోపు వేడుకలు ముగించాలని పోలీసులు ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..