Hyderabad: 16 గంటల్లో బంగారం దొంగలను పట్టేశారు..

మలక్‌పేటలోని కిస్వా జువెలరీ దుకాణంలో పట్టపగలే దోపిడీకి పాల్పడిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 6 గంటల్లో కేసును ఛేదించి రూ.24 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ జానకి శుక్రవారం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Hyderabad: 16 గంటల్లో బంగారం దొంగలను పట్టేశారు..
Telangana Police

Updated on: Feb 17, 2024 | 1:53 PM

మలక్‌పేటలోని ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నేరస్థులను హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, సౌత్‌ఈస్ట్‌ జోన్‌ బృందం, చాదర్‌ఘాట్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నివాసి నజీమ్‌ అజీజ్‌ కొటాడియా (36) కొంపల్లిలోని స్కైగార్డెన్‌లో నివాసం ఉంటున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ గాజీపూర్‌లోని ఎస్సీపూర్‌కు చెందిన షౌకత్‌రైనీ (19), మహమ్మద్‌ వారిస్‌ (18) జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో ఉంటున్నారు. వీరు ర్యాపిడో డ్రైవర్లుగా వర్క్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ పాసింజర్‌ను దింపేందుకు నజీమ్‌ అక్బర్‌బాగ్‌ వైపు వచ్చాడు. కిస్వా జువెలరీ షాప్‌వై అతని మనసు పడింది. షౌకత్‌, వారిస్‌లతో చర్చించి దోపిడీకి స్కెచ్ వేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 14న, నిందితులు అక్బర్‌బాగ్‌లోని కిస్వా జ్యువెలర్స్‌లోకి ప్రవేశించి షాజీ-ఉర్-రహమాన్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచారు. ఆపై బంగారు, వెండి ఆభరణాలు చోరీకి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు దుకాణంలో అందుబాటులో ఉన్న సిసిటివి ఫుటేజీని పరిశీలించారు. అందులో ముగ్గురు నిందితులు షాపులోకి ప్రవేశించి దోచుకుని.. వెళ్లినట్లు ఉంది. సీసీ కెమెరాలను పరిశీలించగా.. ద్విచక్రవాహనాల్లో వచ్చి అబిడ్స్‌లోని తాజ్‌ హోటల్‌కు వాటిని.. పార్క్‌ చేసి..  దుకాణంలోకి వెళ్లి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

నేరం చేసిన తర్వాత నజీం ఇంటికి చేరుకుని నగలను అతని ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు సాయంత్రం వేళల్లో ముగ్గురు నిందితులు రాపిడో కారును బుక్ చేసి, అబిడ్స్,  మలక్‌పేట వైపు వచ్చి, వారి మూడు బైక్‌లను తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..