Hyderabad: డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు.. భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

|

Sep 20, 2024 | 12:39 PM

వ్యసనాలకు అలవాటుపడిని కొందరు విద్యార్ధులు డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డారు. ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పాటు మరో ముగ్గురు అరెస్టయ్యారు. నిందితుల వద్ద నుంచి..

Hyderabad: డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు.. భారీగా డ్రగ్స్‌ స్వాధీనం
Engineering Students Selling Drugs
Follow us on

హైదరాబాద్, సెప్టెంబర్‌ 20: వ్యసనాలకు అలవాటుపడిని కొందరు విద్యార్ధులు డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డారు. ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పాటు మరో ముగ్గురు అరెస్టయ్యారు. నిందితుల వద్ద నుంచి రూ.1.53 లక్షల విలువ చేసే 30 ఎల్‌ఎస్‌డీ బ్లాస్ట్‌లు, 5.77 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ తిరుపతి యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

మాదాపూర్‌కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్ధులు చెన్నైతో చదువుతున్నారు. ఈ ముగ్గురు మంచి స్నేహితులు కూడా. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో మాదక ద్రవ్యాలు విక్రయించేందుకు తెగించారు. బెంగళూరు నుంచి గుర్తుతెలియని వ్యక్తి వద్ద తక్కువ ధరకు డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, నగరంలో పలువురికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటూ విలాసవంతంగా జీవించసాగారు. దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ తిరుపతి తన బృందంతో రంగంలోకి దిగారు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి డ్రగ్స్‌ విక్రయించేందుకు యత్నిస్తున్న దత్తిలితిన్‌, అభిరామ్‌, కొడాలి ఏమార్ట్‌లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. దీంతో ముగ్గురినీ అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.83వేల విలువ చేసే 5.77గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యవసనాలకు అలవాటుపడి డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను హైదరాబాద్‌ డీటీఎఫ్‌ అధికారులు పట్టుకున్నారు.

నిందితులను చరణ్‌ తేజ్‌, కౌశిక్‌ తూబోటి, సయ్యద్‌ సర్ఫరాజ్‌ చెన్నైలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఈ ముగ్గురూ డబ్బుల కోసం డ్రగ్స్‌ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. చెన్నై నుంచి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అరుణ్‌రాజ్‌ ద్వారా సరుకు కొనుగోలు చేసి, నగరంలో అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న డీటీఎఫ్‌ టీం గురువారం మాటువేసి జూబ్లీహిల్స్‌ మాదాపూర్‌ రోడ్‌నం.37లో డ్రగ్స్‌ విక్రయిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.