హైదరాబాద్ నగరం పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు.. అలాంటి ఇలాంటి దొంగలు కాదు.. పెంపుడు జంతువులను ఎత్తుకెళ్లి వండుకుని తినేవారు.. ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లిపై కన్నేసిన ముగ్గురు వ్యక్తులు దాన్ని ఎత్తుకెళ్లి.. వండుకుని తిన్నారు. ఈ ఘటన నేరేడ్‌మెట్‌లో చోటుచేసుకుంది. ఓ ఇంటి నుంచి పెంపుడు పిల్లిని దొంగిలించి, వండుకుని తిన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గత ఆదివారం జరగగా.. యజమాని ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత నెల 29వ తేదీన నేరేడ్‌మెట్ జీకే కాలనీలోని ఓ ఇంట్లో పెంచుకునే పిల్లిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారంటూ పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా పిల్లిని దొంగలించిన వ్యక్తులను గుర్తించారు. ఇంట్లోనున్న పిల్లిని దొంగిలించిన ముగ్గురు.. ఆతర్వాత దానిని బస్తాలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
వినాయక్ నగర్‌లో నివసించే నర్సింగ్, కిరణ్, శంకర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులపై IPC 448,428 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..