Statue of Equality Inauguration Live Updates: శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు హైదరాబాద్(Hyderabad) శివారులోని శ్రీ చిన్న జీయర్ ఆశ్రమంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం జరుగుతోంది. ‘సమానత్వం విగ్రహం'(Statue of Equality)గా పిలువబడే శ్రీరామానుజాచార్య (Sri Ramanujacharya) 216 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ఆవిష్కరించారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల సువిశాల స్థలంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ప్రధాని మోదీ.. తొలుత విశ్వక్సేనుడి పూజలో పాల్గొన్నారు.‘సమానత్వం విగ్రహం’ చుట్టూ ఉన్న వినోదాల వంటి 108 దివ్య దేశాలను కూడా ప్రధాని సందర్శించారు. శ్రీరామానుజ జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను, మ్యూజియంను ప్రధాని సందర్శించారు. శ్రీరామానుజాచార్యుల జీవిత ప్రయాణం, విద్యాబోధనపై త్రీడీ ప్రెజెంటేషన్ మ్యాపింగ్‌ను కూడా ప్రదర్శించారు. నుదుటిపై విష్ణునామాలు ధరించి సంప్రదాయ పట్టువస్త్రాల్లో మోడీ సమతా స్ఫూర్తి కేంద్రానికి విచ్చేశారు. సమతా మూర్తి సహస్రాబ్ది సమారోహంలో ఆయన పాల్గొన్నారు. రుత్వికులు ప్రధాని మోడీ చేత సంకల్పం చేయించారు. చినజీయర్ స్వామీజీ ఇచ్చిన కంకణాన్ని ప్రధాని ధరించారు. యాగశాలలో మోడీ ప్రత్యేక పూజలు చేసి విష్వక్సేన ఇష్టి యాగంలో పాల్గొన్నారు. యాగశాల నుంచి ఆయన ప్రధాన ఆలయం, ఆశ్రమాన్ని సందర్శించారు.వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల నమూనా ఆలయాలను సందర్శించారు. భగవద్ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోడీ లోకానికి అర్పితం చేశారు.
శ్రీరామనగరంలో ప్రతిష్టించిన సమతాామూర్తి మంగళ రూపం.. ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం. కాగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని గతేడాది అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇదే కావడం విశేషం. దీని ఎత్తు 182 మీటర్లు. కాగా ముచ్చింతల్‌లో ఆవిష్కృతం కానున్న రామానుజ విగ్రహం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం కానుంది. థాయిలాండ్‌లోని బుద్ధ విగ్రహం (301 అడుగులు) కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది.
ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని సకల జనులకు అందించిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవద్రామానులు.. 11వ శతాబ్దానికి చెందిన కుల వివక్ష, పేద ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడిన అధ్యాత్మిక వైష్ణవయోగిశ్రీరామానుజాచార్యుల స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.
ఈ విగ్రహం బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్‌ల కలయికతో ‘పంచధాతు’తో తయారు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లోహ విగ్రహాలలో కూర్చొని ఉండేటటువంటి విగ్రహాలలో ఇది ఒకటి. ఇది 54 అడుగుల ఎత్తైన బేస్ భవనంపై విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చిన జీయర్ స్వామి ఆశ్రయంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంగణంలో శ్రీరామనుజ ఆలయంతో పాటు వేద డిజిటల్ లైబ్రరీ,పరిశోధనా కేంద్రం, ప్రాచీన భారతీయ గ్రంథాలు, థియేటర్, ఎడ్యుకేషనల్ గ్యాలరీ, ఇది సెయింట్ రామానుజాచార్య అనేక రచనల వివరాలను అందిస్తున్నారు. ఈ విగ్రహాన్ని శ్రీ రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన శ్రీశ్రీశ్రీ త్రిదిండి చిన్న జీయర్ స్వామి రూపొందించారు.
ప్రధాని మోడీ పాల్గొనే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరామానుజాచార్యుల జీవిత ప్రయాణం, విద్యాబోధనపై త్రీడీ ప్రెజెంటేషన్ మ్యాపింగ్‌ను కూడా ప్రదర్శించారు . ‘సమానత్వం విగ్రహం’ చుట్టూ ఉన్న వినోదాల వంటి 108 దివ్య దేశాలను కూడా ప్రధాని సందర్శిస్తారు. శ్రీ రామానుజాచార్యులు దేశ, లింగ, జాతి, కుల, వర్ణాలకు అతీతంగా ప్రతి మనిషి స్ఫూర్తితో ప్రజల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రామానుజాచార్య 1000వ జయంతి ఉత్సవాల్లో అంటే 13 రోజుల శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రారంభోత్సవం జరుగుతోంది.
మోడీ పర్యటనతో శ్రీరామనగరంలో అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని భద్రతా చర్యలను పర్యవేక్షించే SPG అధికారులు.. ఇప్పటికే రాష్ట్ర పోలీసులతో పలుసార్లు సమీక్షించారు. శ్రీరామనగరంలో కార్యక్రమం ముగిశాక శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మోడీ.. తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు.
విశ్వ ఆధ్మాత్మిక, జ్ఞాన కేంద్రంగా ముచ్చింతలో జరుగుతున్న భగవద్రామానుజుల సహస్రాబ్ది సమతా మహోత్సవం కనులారా వీక్షించండి…
హైదరాబాద్ పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. శంషాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
విగ్రహావిష్కరణ అనంతరం యాగశాలకు చేరుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమం గుండం దగ్గర ధ్యానం చేశారు. 5 వేల మంది రుత్విజులు ప్రధాని మోడీకి వేద ఆశీర్వచనం అందించారు.
శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన త్రీడి విధానంలో సాంస్కృతిక కార్యాక్రమాల ప్రదర్శన సాగుతోంది. సమతా కేంద్రంలో జరుగుతున్న లేజర్ షోను ప్రధాని మోడీ తిలకిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రామానుజాచార్య జీవిత విశేషాలను త్రీడీ రూపంలో ప్రజెంట్ చేశారు. జాతి, కుల, మత విబేధాలు లేకుండా అందరి సమానత్వం కోసం రామానుజాచార్య అవిశ్రాంతంగా పనిచేసిన విషయాన్ని చినజీయర్ స్వామి ప్రధాని మోడీకి వివరించారు. శ్రీరామానుజాచార్యుల జ్ఞానాన్ని , తత్వాన్ని ప్రజలకు వ్యాప్తి చేయడానికి లేజర్ షో ప్రదర్శించారు. లేజర్ షోల ద్వారా వాటి గురించి ప్రజలకు తెలియజేశారు.
తెలంగాణలోని 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రుద్రేశ్వర్-రామప్ప ఆలయాన్ని గతేడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిందని ప్రధాని మోడీ తెలిపారు. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కూడా పోచంపల్లిని భారతదేశంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించిందని మోడీ అన్నారు.
ఒకవైపు జాతి ఆధిక్యత, భౌతికవాదం ఉన్మాదమని, మరోవైపు మానవత్వం, ఆధ్యాత్మికతపై విశ్వాసం పెరుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది.భారతదేశ సంప్రదాయం విజయం సాధించింది. భారత స్వాతంత్య్ర పోరాటం కేవలం అధికారం, హక్కుల కోసం జరిగే పోరాటం కాదని ఆయన అన్నారు. ఈ పోరాటంలో, ఒక వైపు ‘వలసవాద మనస్తత్వం’, మరోవైపు ‘జీవించి జీవించనివ్వండి’ అనే నినాదంతో సాగిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
రామానుజాచార్య జీ కూడా భారతదేశం ఐక్యత, సమగ్రతకు ప్రజల ప్రేరేపణగా నిలిచారు. అతను దక్షిణాన జన్మించినప్పటికీ.. ఆయన ప్రభావం దక్షిణం నుండి ఉత్తరం,తూర్పు నుండి పశ్చిమం వరకు భారతదేశం మొత్తం మీద ఉందన్నారు.
అభివృద్ధి జరగాలని, వివక్ష లేకుండా అందరూ ఉండాలని ప్రధాని ఆకాక్షించారు. సామాజిక న్యాయం, వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పొందాలి. శతాబ్దాలుగా అణచివేతకు గురైన వారు పూర్తి గౌరవంతో అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఇందుకోసం మారుతున్న నేటి భారతదేశం ఐక్యంగా కృషి చేస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
ఇవాళ ఆవిష్కరించిన రామానుజాచార్య భారీ విగ్రహం.. సమానత్వానికి ప్రతిమ రూపంలో సమానత్వ సందేశాన్ని ఇస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందేశంతో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్’ అనే మంత్రంతో ఈ రోజు దేశం తన కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తోందని ప్రధాని అన్నారు.
చెడుతో పోరాడే వారికే గౌరవం దక్కుతుందని ప్రధాని మోడీ అన్నారు. అభివృద్ధి అనేది సమాజంలోని వ్యక్తుల నుండి మాత్రమే వస్తుంది. రామానుజాచార్యులు దళితులకు పూజా హక్కు కల్పించారు. దళితులు, వెనుకబడిన వారిని ఆదరించారు అని మోడీ అన్నారు.
సంస్కరణల కోసం ఎవరైనా తన మూలాల నుండి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. బదులుగా మన నిజమైన మూలాలతో మనం కనెక్ట్ అవ్వడం, మన నిజమైన శక్తి గురించి తెలుసుకోవడం అవసరం. నేటి ప్రపంచంలో, సామాజిక సంస్కరణలు, పురోగతి విషయానికి వస్తే, సంస్కరణలు మూలాలకు దూరంగా జరుగుతాయని నమ్ముతారు. కానీ, రామానుజాచార్యను చూసినప్పుడు, ప్రగతిశీలతకు, ప్రాచీనతకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదని మనకు అర్థమవుతుందని ప్రధాని అన్నారు.
రామానుజాచార్యుల భక్తి మార్గ పితామహుడు అని అన్నారు. ఒక వైపు అతను సుసంపన్నమైన సన్యాస సంప్రదాయానికి చెందిన సాధువు, మరోవైపు అతను గీతా భాష్యంలో కర్మ ప్రాముఖ్యతను కూడా ప్రదర్శిస్తారు. తన జీవితమంతా కర్మకే అంకితం చేస్తారు.
భారతదేశం అద్వైతం కూడా ఉంది. ద్వంద్వత్వం కూడా ఉంది. ఈ ద్వంద్వ-అద్వైతాలను కలుపుతూ.. శ్రీ రామానుజాచార్య విశిష్ట-ద్వైతం కూడా ఉందని మోడీ పేర్కొన్నారు.
జగద్గురు శ్రీ రామానుజాచార్య భారీ దివ్య రూప విగ్రహం ద్వారా భారతదేశం మానవ శక్తిని, స్ఫూర్తిని పొందుతోందని ప్రధాని మోడీ అన్నారు. రామానుజాచార్య విగ్రహం అతని జ్ఞానం, నిర్లిప్తత, ఆదర్శాలకు చిహ్నమని పేర్కొన్నారు.
భద్రవేదిక మూడో అంతస్తులో 216 అడుగుల రూపంలో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహాన్ని.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామితో కలిసి పూజలు నిర్వహించినంతరం ప్రధాని నరేంద్ర మోడీ.. జాతికి అంకితం చేశారు. 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దివ్యక్షేత్రం శ్రీరామనగరంలో శ్రీ రామానుజులవారి వెయ్యేళ్ల పండుగ ఘనంగా జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోడీ ముచ్చింతల్ ఆశ్రమంలో వసంత పంచమి పర్వదినాన సమతామూర్తి శ్రీరామానుజలవారి భవ్యమైన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
వెయ్యేళ్ల తర్వాత రామానుజుల భవ్య విగ్రహం ముచ్చింతల్ దివ్యసాకేతంలో వెలిసింది. శ్రీచినజీయర్ స్వామి సంకల్పంతో 216 అడుగుల భవ్య విగ్రహం సాక్షాత్కరించింది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన దివ్యమంగళ రూపం శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
సమతామూర్తి మ్యూజయంను సందర్శించిన ప్రధాని మోడీ.
సమతా మూర్తి క్షేత్రంలోని దివ్య తిరుమల దర్శనం చేసుకున్న ప్రధాని మోడీ
పవిత్రమైన ఆలోచనలు, బోధనలు మనకు స్ఫూర్తినిచ్చే శ్రీరామానుజాచార్య స్వామికి ఇది సముచితమైన నివాళి. అంటూ ప్రధాని మోడీ ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రారంభోత్సవానికి ముందుకు ట్వీట్ చేశారు.
At 5 PM, I will join the programme to inaugurate the ‘Statue of Equality.’ This is a fitting tribute to Sri Ramanujacharya, whose sacred thoughts and teachings inspire us. https://t.co/i6CyfsvYnw
— Narendra Modi (@narendramodi) February 5, 2022
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రారంభోత్సవానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. సమతా మూర్తి విగ్రహం దగ్గరకు చేరుకున్నారు.
శ్రీశుక మహర్షి చిలక రూపంలో భాగవతం చెప్పాడని అంటారు. దానికి సంకేతమే చిలకల మండపంలో ప్రధాని మోడీ చిలక రూపంలో భాగవతం వివిష్టతను చినజీయర్ స్వామి వివరించారు
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలు పఠిస్తున్నారు.
సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో మూడుగంటలపాటు గడపనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సమతామూర్తి కేంద్ర విశిష్టతను ప్రధాని మోడీకి చినజీయర్ స్వామి వివరించారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. రాత్రి 7 గంటలకు 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
యాగశాలలో వైష్టవ సంప్రదాయాల ప్రకారం మూడు నామాలు ధరించిన ప్రధాని మోడీ.. యాగశాలలో పెరుమాళ్లను దర్శించుకున్నారు.. ప్రధాని మోడీకి యజ్ఞంలో యజమానిగా కంకణధారణ చేసిన చిన జీయర్ స్వామి. అనంతరం విశ్వక్సేనుడి పూజను నిర్వహిస్తున్నారు. ప్రధాని వెంట యాగశాలలో చిన్నజీయర్ స్వామి, గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మైహోమ్స్ అధినేత రామేశ్వరరావు పాల్గొన్నారు.
ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి అతిథి గృహం నుంచి ప్రధానమంత్రి నరేందర మోడీ.. నేరుగా యాగశాల చేరుకున్నారు. ఈయనకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వరరావు ఘన స్వాగతం పలికారు.
జీవన కాలం – క్రీ.శ. 1017- క్రీ.శ. 1137 (120 సం.)
పెద్దలు పెట్టిన పేరు – ఇళై ఆళ్వార్, రామానుజుడు
పుట్టిన ఊరు – శ్రీపెరంబదూరు, కాంచీపురం జిల్లా, తమిళనాడు
తల్లిదండ్రులు – కాంతిమతి, కేశవ సోమయాజి
భార్య – తంజ (రక్షమాంబ)
కులదైవం – కాంచి వరదరాజ స్వామి
జీవితంతో ముడిపడ్డ ప్రదేశాలు- శ్రీపెరంబదూర్, కాంచీపురం, శ్రీరంగం, తిరుగోష్టియూర్, తిరుమల, సింహాచలం, శ్రీకూర్మం, మేల్కోటే, కాశ్మీరం
ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. సమతామూర్తి ప్రాంగణం మొత్తం SPG రక్షణ వలయంలోకి వెళ్లిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఆ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. స్పెషల్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులు సైతం అటు యజ్ఞశాల, ఇటు సమతామూర్తి ప్రాంగణంతోపాటు ఆశ్రమ పరిసరాల్లో తనిఖీలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. వివిఐపీలు, విఐపీలు , ఇతర ప్రముఖులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారు.
రామానుజచార్యుల విగ్రహంపై 15నిమిషాలపాటు జరిగే 3డీ షోను ప్రధాని మోడీ వీక్షిస్తారు. అక్కడి నుంచి మరోసారి యాగశాలకు చేరుకుని.. శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలుకుతారు. ఈ సందర్భంగా 5వేల మంది రుత్వికులు ప్రధాని మోడీకి వేదఆశీర్వాదం ఇస్తారు.
అనంతరం భద్రవేదిక మూడో అంతస్తులో 216 అడుగుల రూపంలో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి.. శ్రీత్రిదండి చిన్నజీయర్‌స్వామితో కలిసి పూజలు నిర్వహిస్తారు ప్రధాని. పూజల అనంతరం రాత్రి 7గంటలకు.. సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు. అక్కడే సుమారు అరంగపాటు ప్రసంగిస్తారు.
సమతామూర్తి కేంద్రంలో.. 108 దివ్యదేశాలతోపాటు భద్రవేదిక మొదటి అంతస్తులోని స్వర్ణమయ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు మోదీ.
శ్రీరామనగరానికి చేరుకున్న ప్రధాని మోదీ… 10 నిమిషాలపాటు సేదతీరి..నేరుగా యాగశాలకు వెళ్తారు. యాగశాలలో పెరుమాళ్లను దర్శించుకుని.. విశ్వక్సేనుడి పూజను నిర్వహిస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుంటారు.
శ్రీరామనగరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రధాని రాకను పురష్కరించుకొని యాగశాల, శ్రీరామానుజాచార్యుల భద్రపీఠం, దివ్యసాకేతం, సభా మండపాన్ని అందంగా అలంకరించారు.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ శుభదినం రానే వచ్చింది. దివ్యక్షేత్రానికి..దివ్యమైన వైభవం.. శ్రీరామనగరంలో శ్రీ రామానుజులవారి వెయ్యేళ్ల పండుగ. ప్రధాని నరేంద్రమోదీ ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్నారు. వసంత పంచమి పర్వదినాన సమతామూర్తి…శ్రీరామానుజలవారి భవ్యమైన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
5.20PM – యాగశాలల సందర్శన
6PM – విశ్వక్సేనేష్టి యాగంలో మోదీ
6.00 – 6.35PM – దివ్య దేశ 108 టెంపుల్ సందర్శన
6.40PM – సువర్ణమూర్తి విగ్రహ సందర్శన
7PM- రామానుజ విగ్రహావిష్కరణ
7.30- 8PM – 3డీ మ్యాపింగ్ లేజర్ షో
8.20PM ఢిల్లీకి పయనం
8.20- శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనం
సమానత్వ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ముచ్చింతల్‌కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. చిన్నజీయర్ స్వామి ఆశ్రమం శ్రీరామనగరంలో జరుగనున్న వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు.
వైష్ణవ సంప్రదాయంలో పూజలందుకునే 12 మంది ఆళ్వారులు కీర్తించిన ఆలయాలే ఈ దివ్యదేశాలు లేదా దివ్య తిరుపతులు! శ్రీరంగం నుంచి వైకుంఠం వరకూ ఇక్కడ 108 దివ్య క్షేత్రాలనూ ఒకేచోట దర్శించే భాగ్యం కల్పించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి!
భగద్రామానుజుల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శిస్తే.. సమతా స్పూర్తి స్ఫురిస్తుంది. జ్ఞాన సోపనంలా మెట్ల మార్గంలో వెళ్తుంటే..సువర్ణమూర్తి మందిరం సాక్షాత్కారమవుతుంది. స్వర్ణమయమైన గర్భగుడిలో భగవద్రామానుజులవారికి నిత్య పూజలు నిర్వహిస్తారు. సప్త వర్ణాలు ప్రకాశించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుత ఏర్పాట్లు చేశారు. మందిర ప్రధాన ద్వారంతో సహా అన్ని ద్వారాలు స్వర్ణ శోభితంగా తీర్చిదిద్దారు.
216 ఎత్తుల రామానుజుల సమతా మూర్తి భవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక పరమోద్దేశం..మన రామానుజ సమతా స్ఫూర్తిని పరివ్యాప్తం చేయడం. ఉత్తమ సంస్కారాలను, సంస్కృతిని భావితరాలకు అందించడం. 108 దివ్య దేశాలను ఒక్కచోట చేర్చడం వెనుక కారణం.. వైదిక మార్గం ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టడం! ఈ మహా సంకల్ప సాకారంలో ఎన్నెన్నో ఒడిదొడుకులు. కానీ వేటికీ వెరవకుండా.. చలించకుండా .. లోక కల్యాణం కోసం ఇలా .. ఇల వైకుంఠపురాన్ని మన కళ్లెదుట సాక్షాత్కారమైంది.
తాబేలు ఆకృతిలో వున్న ఈ పుణ్యభూమి..శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి సత్య సంకల్పానికి అమ్మ ఒడిగా మారింది. ఆ మహనీయుని ధృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనమే..భగవద్రామానుజుల ఈ విరాట్ విగ్రహం!
శ్రీమన్నారాయణ శ్రీశ్రీశ్రీ త్రిదిండి చినజీయరస్వామిజీ అనురక్తి అడుగునా కన్పిస్తుందిక్కడ. అంతటా శుభ సంకేత నవ విధ విశిష్టాలే. రామానుజచార్యులు జన్మించింది 1017లో 1..0.1..7 ..కూడితే 9. రామానుజులు భావితరాలకు అందించిన గ్రంథాలు 9.ముచ్చింతలో సమత మూర్తి ఎత్తు 216 అడుగులు..2..1..6 కలిపితే 9. విగ్రహాం 108 అడుగులు. 1..0..8 కలిపితే 9. ఇక భద్రపీఠం 54 అడుగులు..5..4 కలిపితే 9. భద్రపీఠాన్ని మోసేలా 36 ఏనుగులు..3 ప్లస్ 6…. 9.. త్రిదండం పొడవు 27 అడుగులు. 2..7 కలిపతే 9. అంతకాదు .బృహాన్‌మూర్తి విగ్రహా తయారీకి 1800 కేజీల పంచలోహాల్ని వినియోగించారు. 1…8..0..0 కలిపితే తొమ్మది. విగ్రహా నిర్మాణానికి పట్టిన సమయం కూడా 9 నెలలు. మరో విశేషం కూడా వుంది. భగవద్రామానుజుల సహాస్రాబ్ది వేడుక 2017లో మొదలైంది. విగ్రహా తయారీ 2016లో..2..0..1..6 కూడితే 9. ఎండ,వాన ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనై చెక్కు చెదరకుండా ఉండేలా బృహాన్ విగ్రహాన్ని నిర్మించారు. కూర్చున్న భంగిమలో అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో మన ముచ్చింతల్‌లోని భగవద్రామానుజ దివ్య విగ్రహాం రెండోది.
సమాజ హితం కోసం రామానుజుల నిర్మించిన మహాద్యోమ చార్రితక స్వరూపమే.. సహస్రాబ్ది వేడుక..మన రామానుజ జాతర. మన ముచ్చింతల్‌లో.. మన తరంలో రామానుజ వెయ్యేళ్ల పండగ జరగడం మన మహద్బాగ్యం.
భగవద్రామానుజులు 1017లో తమిళనాడులోని శ్రీపెరంబూదురలో అవతరించారు. చిన్నతనం నుంచే సత్ గురు సేవ కోసం పరితపించారు. కంచి వరదారాజస్వామితోనే యతిరాజ అని పిలిపించుకున్నారు. సాక్షాతే శ్రీరంగనాథుడే ఉడయవరు కోసం వేచి చూశారంటే.. భక్తుడిపై భగవంతుడికి ఎంతటి అనురక్తి. అదీ భగవద్రామానుజ భక్తి ప్రపత్తి.
ధర్మానికి ఆపద కలిగినప్పుడు. శిష్ణ రక్షణ..దుష్ట శిక్షణ కోసం భగవంతుడు అవతరిస్తాడు. కొన్ని సార్లు భగవత్ అంశతో భువిపై నడియాడిన ఆచార్యులు ధర్మ పరిరక్షణ, సమాజోద్దరణకు మార్గం చూపారు. ఆదిశేషుడి అంతగా భువిని పావనం చేసిన చరితార్ధులు..మన భగవద్రామానులు. భక్తి,జ్ఞాన మార్గాల ద్వారా ఉత్తమ సంస్కారాలతో..సామాజిక సంస్కరణలతో విష్టాద్వైత సత్య సంకల్పాన్ని దేదీప్యమానం చేసిన విశ్వగురువు… భగవద్రామానుజులు. మనకే కాదు సాక్షాత్ ఏడుకొండల వేంకటేశ్వురుడికే ఘన గరువు ..మన శ్రీరామానుజచార్య 216 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికాసేపట్లో ఆవిష్కరించనున్నారు.
గాలి.. వెలుతురు.. జ్ఞానం.. అందరికీ సమానమే అంటూ నినదించారు శ్రీరామానుజులు. కుల వివక్ష, పేద ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడిన అధ్యాత్మిక వైష్ణవయోగి. ఆయన బోధించిన పాఠాలు.. స్ఫూర్తిని రగిలింపచేస్తూ ఉంటాయి. ఆ సమతామూర్తిని చేరడానికి సోపానాలుగా నిలిచిన విశాలమైన మందిరాలు.. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే.. వెయ్యేళ్లక్రితం బోధించిన జ్ఞానజ్యోతులు ప్రకాశిస్తూ కనిపించేలా ఉంటాయి.