
కువైట్‌లో చిక్కుకుపోయిన 163 మంది ఇండియన్స్ ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని తెలుస్తుంది. ప్రయాణికుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 3హెల్త్ టీమ్స్, 10ఇమ్మిగ్రేషన్ హెల్త్ టీమ్స్ ద్వారా వచ్చినవారికి స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని క్వారంటైన్‌కు తరలించారు. వీరందర్నీ హోటళ్లలో ప్రభుత్వం క్వారంటైన్ చేయనుంది. సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన వందే భారత్ మిషన్ భాగంగా స్వదేశానికి భారతీయలను తలించారు.
46రోజుల లాక్ డౌన్ తర్వాత మొదటి విదేశీ ఫ్లైట్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పూర్తి అలర్ట య్యారు. హౌస్ కీపింగ్ మొదలు ఉన్నతాధికారి వరకు పీపీఈ కిట్ లు ధరించారు.