బ్యాంకు లాకర్లో ఉన్న డాక్యుమెంట్లకు చెదలు

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 9:24 PM

హైదరాబాద్‍ ఎల్బీనగర్‌‌లోని బహుదూర్‌ గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గంధం వెంకటయ్య టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య కరుణశ్రీతో కలిసి మన్సూరాబాద్‌‌లోని ఆంధ్రాబ్యాంక్‌ లాకర్‌లో బంగారు ఆభరణాలు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను భద్రపరిచారు. గత ఐదేళ్లుగా అవి బ్యాంక్ లాకర్‌లోనే ఉంటున్నాయి. బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరయ్యే క్రమంలో వెంకటయ్య దంపతులు తమ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి మంగళవారం (మార్చి 5) ఆంధ్రా బ్యాంక్‌‌కు వచ్చారు. అక్కడ లాకర్‌ను తెరిచి చూసి షాక్‌కు గురయ్యారు. […]

బ్యాంకు లాకర్లో ఉన్న డాక్యుమెంట్లకు చెదలు
Follow us on

హైదరాబాద్‍ ఎల్బీనగర్‌‌లోని బహుదూర్‌ గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గంధం వెంకటయ్య టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య కరుణశ్రీతో కలిసి మన్సూరాబాద్‌‌లోని ఆంధ్రాబ్యాంక్‌ లాకర్‌లో బంగారు ఆభరణాలు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను భద్రపరిచారు. గత ఐదేళ్లుగా అవి బ్యాంక్ లాకర్‌లోనే ఉంటున్నాయి.

బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరయ్యే క్రమంలో వెంకటయ్య దంపతులు తమ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి మంగళవారం (మార్చి 5) ఆంధ్రా బ్యాంక్‌‌కు వచ్చారు. అక్కడ లాకర్‌ను తెరిచి చూసి షాక్‌కు గురయ్యారు. లాకర్‌లోని డాక్యుమెంట్లు చెదలుపట్టి పాడైపోయాయి. ఆయన బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నించగా, తమకు సంబంధం లేదని వారు చేతులు దులిపేసుకున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ అంతా తడిగా ఉందని.. అందులోకి నీరు చేరడంతోనే ఈ నష్టం జరిగిందని వెంకటయ్య ఆరోపించారు. బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

లాకర్‌లో పెట్టిన వస్తువులతో తమకు సంబంధం లేదని, తాము లాకర్‌ సదుపాయం మాత్రమే కల్పిస్తామని బ్యాంక్‌ మేనేజర్‌ సోమశేఖర్‌ స్పష్టం చేశారు. బ్యాంకులు ఎక్కువగా గోద్రేజ్ కంపెనీకి చెందిన లాకర్లను వినియోగిస్తున్నాయి. లాకర్లకు చెదలు పట్టిన విషయాన్ని గోద్రేజ్‌ కంపెనీ మేనేజర్‌ నర్సింహారావుకు సమాచారం అందించారు. ఆయన‌ బుధవారం బ్యాంకుకు చేరుకొని పరిశీలించారు. లాకర్‌లోకి నీరు చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, తమ లోపమేమీ లేదని ఆయన తెలిపారు. తమకు జరిగిన నష్టానికి బాధ్యులెవరో తెలియక వెంకటయ్య దంపతులు నెత్తి, నోరు బాదుకుంటున్నారు.