Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OU – JNTU Exams: ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ పరీక్షలు యధాతథం.. నోటిపికేషన్ విడుదల..

Osmania University Results: కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి ఉస్మానియా యూనివర్సిటీ,..

OU - JNTU Exams: ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ పరీక్షలు యధాతథం.. నోటిపికేషన్ విడుదల..
Osmania University
Follow us
Shiva Prajapati

| Edited By: Team Veegam

Updated on: Mar 24, 2021 | 12:05 PM

Osmania University Results: కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలు తెరదించాయి. హైదరాబాద్‌లోని ఈ రెండు యూనివర్సిటీల పరిధిలోని జరిగే పరీక్షలన్నీ కూడా యధాతథంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రకటనలు విడుదల చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల పరీక్షలు యధాతథంగా నిర్వహించనున్నట్లు మంగళవారం నాడు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ప్రకటించారు. ఆ మేరకు ఆయన పేరిట ఒక ప్రకటనను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకనటలో పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే పీజీ, ఇంజినీరింగ్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాగా, బుధవారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇదిలాఉండగా.. జేఎన్‌టీయూ పరిధిలోని పరీక్షలు కూడా యధావిధిగా జరుగుతాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన చేశారు. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా పరీక్షలు రాయలేని వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రత్యేక పరీక్షను రెగ్యులర్‌గానే పరిగణిస్తామని ప్రకటించారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఓయూ, జేఎన్టీయూ యంత్రాంగం.. పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చాయి.

ఓయూ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను మంగళవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బీఏ, బీబీఏ, బీకామ్‌, బీఎస్సీ తదితర కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని, అభ్యర్థులు తమ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చెక్ చేసుకోవచ్చునని తెలిపారు.

Also read:

దేశం కాని దేశంలో తలదాచుకుంటున్న వారిపై పగబట్టిన విధి.. ప్రపంచంలోనే అతి పెద్ద రెఫ్యూజీ క్యాంప్ లో భారీ అగ్ని ప్రమాదం

Photo Gallery: కూరగాయలు అమ్మడంలో ఇతగాడి క్రియేటివిటీ నెక్ట్స్ లెవల్.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్