వ్యాపారం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది . కొనుగోలుదారులను ఆకట్టుకోవాలంటే కాస్త డిఫరెంట్ స్ట్రాటజీ వాడాల్సిందే. అందులో ఈ కూరగాయలు అమ్మే వ్యక్తి నిష్ణాతుడు.
పెద్ద పెద్ద వ్యాపారులు అయితే తమ బ్రాండ్లను ఏదో ఒక రకంగా ప్రమోట్ చేసుకుంటారు. రకరకాల ఆఫర్లు పెడతారు.. లేదంటే స్టార్లను ప్రమోషన్ కోసం హైర్ చేసుకుంటారు. అయితే, సాధారణ వ్యాపారుల వైపు ఎవరూ చూడరు. వారి షాపుకు ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కస్టమర్లు ఆకర్షితులవుతారు.
1 / 5
రోడ్డు మీద కాయగూరలు అమ్మే ఈ వ్యక్తికి అలాంటి స్పెషాలిటీ ఒకటి ఉంది. ఇతడు డ్యాన్స్ చేస్తూ కూరగాయలు.. పాటలతో ఆకుకూరలు అమ్మేస్తాడు. అందుకే అతడిని అంతా ‘చుల్‌బుల్ పాండే’ పేరుతో పిలుస్తారు.
2 / 5
దబాంగ్ సినిమాలో పాత్రలా.. తలకు టవల్ కట్టుకుని.. మంచి కళ్లజోడు పెట్టుకుని.. ‘ఆజావ్ భాయ్ సబ్జీ లేలో’ అనే ప్రత్యేకమైన పాటకు చిందులేస్తూ కూరగాయలను అమ్మడం ఇతగాడి స్టైల్.
3 / 5
జార్ఖండ్‌లోని దన్‌బాద్‌లో నివసిస్తున్న ఈ కూరగాయల వ్యాపారి పేరు రితేష్ పాండే. ఓ మహిళ ఇతడి వీడియో తీయడంతో ఫేమస్ అయిపోయాడు.
4 / 5
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కాస్త క్రియేటివిటి ఉన్నా ఫేమస్ అవ్వొచ్చు అనడానికి.. ఇతడో ఉదాహారణ