Online Chatting: ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ మోటాలు, అమ్మాల చాటింగ్‌ల వల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో చాలా మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని రోడ్డున పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. చివరికి చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి ఆన్‌లైన్ మోసాలకు దూరంగా ఉండాలని, లేకపోని చిక్కుల్లోపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు పదేపదే చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.తాజాగా డేటింగ్ యాప్‌ల వలలో చిక్కుకున్న ఓ వైద్యుడు ఏకంగా రూ.70 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ ఓ ఇరవై ఏళ్ల వైద్యుడు ఇంత మొత్తం సమర్పించుకున్నాడు. ముషీరాబాద్‌లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్న డాక్టర్ రమేష్ గుజరాత్‌లో వైద్యం చేస్తుంటాడు. నెలలో కొంత కాలం గుజరాత్‌లో, మిగతా రోజులు హైదరాబాద్‌లో ఉంటాడు. ఆరు నెలల కిందట ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతితో కొంత కాలం వాట్సాప్‌లో చాటింగ్ కొనసాగించాడు. తర్వాత ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఓ రోజు ఆ అమ్మాయి ఈ వైద్యుడిని ప్రేమిస్తున్నానంటూ గాలం వేసింది. ఇద్దరు కలిసి న్యూడ్ వీడియో కాల్స్ కూడా చేసుకున్నారు. ఈ తథంగాన్ని ఆ మాయలేడి రికార్డ్ చేసింది.కోరినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించసాగింది. దీంతో ఆ వైద్యుడు 2020 నవంబర్ నెలలో ఆమెకు పలు దఫాలుగా రూ.39 లక్షల వరకు ముట్టజెప్పాడు. అయినప్పటికీ డిమాండ్ పెరుగుతుండటంతో తట్టుకోలేక చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఆమెలో తీరుమారకపోవడంతో డేటింగ్ యాప్‌లో ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత నెల రోజుల్లో ఆయన మరో 30 లక్షల వరకు సమర్పించుకున్నట్లు పోలీసులకు తెలిపారు. అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నావని భార్యా, పిల్లలు ప్రశ్నించగా, నా డబ్బులు నా ఇష్టం. నాకు నచ్చినట్లు చేస్తానంటూ ఎదురుదాడికి దిగుతున్ననాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఆయన బ్యాంకు ఖాతాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరగా, ఖాతాలను సైతం పోలీసులు స్తంభింపజేశారు. అయితే ఇప్పుడా ఖాతాను తెరిపించాలని వైద్యుడు కోరుతున్నాడు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఏసీపీ కెవి ఎం ప్రసాద్ ఆ వైద్యుడితో మాట్లాడారు. ఇకపై గుర్తు తెలియని వారికి డబ్బులు బదిలీ చేయనని రాతపూర్వకంగా హామీ ఇస్తే ఖాతాను తెరిపిస్తామని తెలిపారు.కాగా, నవంబర్ నెలలో రూ.39 లక్షల పోగొట్టుకున్న తర్వాత … సార్ నా డబ్బులు తిరిగి వస్తాయా..? నిందితులను పట్టుకుంటారా..? అంటూఐ రోజూ సైబర్ క్రై్ పోలీసులను అడుగుతుండటం గమనార్హం.
ఇవీ చదవండి: Rajasthan Crime : రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి మరణ శిక్ష
West Godavari Crime: పశ్చిమగోదావరి జిల్లాలో ఖతర్నాక్ దొంగలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌నే దోచేశారు